DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాల కృష్ణులు భళి భళి . . . మధుర ను తలపించిన శిశుమందిర్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) :  à°¶à±à°°à±€ కృష్ణ జన్మాష్టమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అలనాటి మధుర, బృందావనాన్ని తలపించే విధంగా విశాఖ నగరం లోని

ద్వారకానగర్ లో గల శ్రీ కృష్ణ విద్యా మందిర్ మారిపోయింది. సోమవారం ఉదయం నుంచి నారాయణీయం కార్యక్రమం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి బాలగోకులం

కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. à°ˆ కార్యక్రమం లో చిన్న పిల్లలచే శ్రీకృష్ణ వేష ధారణలు పోటీలు నిర్వహించారు.  à°¨à°¾à°°à°¾à°¯à°£à±€à°¯à°‚ పేరిట నిర్వహించిన శ్రీ కృష్ణ

బాల లీలల్లో  
ఉషా అనిరుద్ధుల పరిణయం, గజేంద్ర మోక్షం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ అవతార ఆవిర్భావం, గోకులాష్టమి, తదితర ఘట్టాలను పాఠశాల చిన్నారులు అద్భుతంగా

రూపొందించారు. అన్ని పాత్రలనూ ఈ పాఠశాల బాల బాలికలే పోషిస్తూ, అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఉన్నత పాఠశాల బాల బాలికలు ఉపన్యాస, వక్తృత్వ పోటీలో పాల్గొని అద్భుతమైన

ప్రదర్శన చేశారు. శివాజీ విభాగం వారు భగవంతుడు భక్తునికి దాసుడు, శ్రీ కృష్ణ దేవరాయ విభాగం వారు కృష్ణ తత్త్వం, వివేకానంద విభాగం వారు కృష్ణుని యందు గోపికల భక్తి,

రామన్ విభాగం వారు మోక్ష ప్రాప్తి - భక్తి రీతులు అనే అంశాల పై ఉపన్యసించి, అందరి మన్ననలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ సాహితి కార్యదర్శి గండికోట

విశ్వనాధం, బివికె సంస్కృత ఉపన్యాసకురాలు హరిప్రియ, తెలుగు భాష పండితులు పివి లక్ష్మి లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పాటల విభాగంలో నృత్య కళాభారతి

ప్రిన్సిపాల్ వెంకటరావు, వయోలిన్ శిక్షకులు కె వి ఎస్ ప్రసాద్, మృదంగ విద్వాన్సులు లక్ష్మణ రావు, సంగీత అకాడమీ నిర్వాహకులు జగదాంబ లు న్యాయ బృందంలో ముఖ్య పాత్ర

పోషించారు.  

అద్భుతం మహోన్నతం నారాయాణీయం:
   à°¦à°¶à°¾à°¬à±à°¦à°¾à°² కాలం నుంచి à°ˆ విధమైన ఆధ్యాత్మిక ప్రదర్శనలను నగర వాసులకు అందిస్తున్నారు. చిన్నారులు రూపొందించిన à°ˆ

ఘట్టాలు అలనాటి బాల గోకులాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  à°ªà°¾à°¥à°¶à°¾à°² లోని విద్యార్థులు నాలుగు బృందాలుగా విడిపోయి కృష్ణ లీల అవతార ప్రదర్శనలు చేశారు. రామన్

విభాగం విద్యార్థులు ఉషా అనిరుద్ధుల పరిణయం ప్రదర్శించగా, 
శ్రీ కృష్ణదేవరాయ విభాగం వారు  à°—జేంద్ర మోక్షం ఘట్టం,  à°¶à°¿à°µà°¾à°œà±€ విభాగం బాలలు  à°¶à±à°°à±€ వరాహ లక్ష్మి

నృసింహ అవతార ఆవిర్భావం అత్యద్భుతంగా చూపించారు. వివేకానంద విభాగం బాల బాలికలు  à°—ోకులాష్టమి,  à°¤à°¦à°¿à°¤à°° ఘట్టాలను పాఠశాల చిన్నారులు అద్భుతంగా రూపొందించారు. à°ˆ

కార్యక్రమాన్ని ఎయు తెలుగు విభాగం విశ్రాంత ఉపన్యాసకురాలు మలయవాసిని, సాహితీ వేత్త పేరి రవికుమార్, తెలుగు భాష ఉపాధ్యాయులు పట్టాభి రామయ్య లు న్యాయ పర్యవేక్షణ

జరిపారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ నగరం లోని అతి కొద్దీ పాఠశాలల్లో మాత్రమే చారిత్రిక, హైందవ సంప్రదాయ ఘట్టాలను నేటికీ చిన్నారులకు తెలియ చేసే విధంగా పలు

కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. వాటిల్లో అగ్ర స్థానంలో ఉంది శిశుమందిర్ ఒకటి అని, హైందవ సంప్రదాయాలను ప్రచారం చెయ్యడమే కాకుండా, ఆచరణలో కూడా చూపిస్తూ,

విద్యార్థులచే నిర్వహింపచేస్తున్నారని అభినందించారు. à°ˆ దర్శనలను చూసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో నగరవాసులు పాఠశాలకు వచ్చారు. 

బాల కృష్ణుల కలకల లు

... 

సాయంత్రం ఇదే వేదిక పై సంస్కార భారతి ఆధ్వర్యవం లో జరిగిన బాల గోకులం కార్యక్రమం లో ఒక ఏడాది వయసు చిన్నారుల నుంచి పదేళ్ల చిన్నారుల వరకూ విద్యార్థులు

కృష్ణ, గోప వేష ధారణల లో అందరినీ అలరించారు. ప్రాకే కృష్ణుల నుంచి పద్యాలు చదివే వరకూ అందరూ శ్రీ కృష్ణ వేష ధారణల్లో మెరిసి, శిశు మందిర్ ప్రాంగణాన్ని మధుర గాను,

బృందావనంగానూ మార్చేశారు. ఈ సందర్బంగా ఏడేళ్ల వయసు కల్గిన కొంతమంది చిన్నారులు భాగవత పద్యాలను సైతం అలవోకగా వినిపించారు. మరి కొందరు కృష్ణ శతక పద్యాలను చక్కగా

ఆలపించిన చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులనూ అందచేయ నున్నారు నిర్వాహకులు. పద్య పఠనం చేసేది చిన్న పిల్లలు అయినా సరే, న్యాయ నిర్ణేతలు మాత్రం ఆధ్యాత్మిక

ప్రవర్తకులు, నిష్ణాతులు. ఒక్క అక్షర దోషం లేకుండా చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 

 

 

 

#dns #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sisu mandir  #sri krishna vidya mandir  #krishna fancy dress  #bala gokulam #narayanaeeyam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam