DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మళ్ల, గుడివాడ నుంచి జగన్ మేలుకోక పొతే పార్టీకి పాతరే : పీతల మూర్తి

రౌడీ షీటరా విశాఖ ఎంపీ అభ్యర్థి ? జగన్ కు, విజయ్ సాయికు పీతల మూర్తి à°¹à±†à°šà±à°šà°°à°¿à°•à°²à± 

విశాఖపట్నం, సెప్టెంబర్ 05 , 2018 (డిఎన్ఎస్ ) : పార్టీని బ్రష్టు పట్టిస్తున్న మళ్ల,

గుడివాడ లాంటి వాళ్ళ నుంచి వైఎస్ జగన్ మోహన్ మేలుకోకపోతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి తొందరలో భూస్థాపితం అవుతుందని వైఎస్ అభిమాని పీతల మూర్తి యాదవ్

హెచ్చరించారు. బుధవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పార్టీని బ్రష్టుపట్టిస్తున్న నగర పార్టీ

అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్ నాధ్ ల వైఖరి పార్టీ ని పూర్తిగా భూస్థాపితం చేసేవిధంగానే ఉందన్నారు. నగరంలో అధికార తెలుగుదేశం

పార్టీ చేస్తున్న భూదందాలు, దోపిడీలపై సాక్ష్యాధారాలతో రుజువుచేసి మళ్ల, గుడివాడ అమర్, ఇతర జిల్లా కమిటీ పెద్దల ముందు పెడితే, వీళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే లు,

మానవ వనరుల శాఖా మంత్రి గంట శ్రీనివాస రావు తో చీకటి ఒప్పందాలు చేసుకుని, ప్యాకేజీలకు సొంతం చేసుకుని, అధికార పార్టీ భూ దందాలపై నోరెత్తలేదన్నారు. వేలకోట్ల

రూపాయలు విలువచేసే భూమిని ( విశాఖ ఆర్ కె  à°¬à±€à°šà± రోడ్ లో) అతి తక్కువకే ఒప్పందం ఇచ్చేశారన్నారు. గతంలో దీనికి శంఖుస్థాపన చేస్తే గుండెల్లో గునపాలు దిగినా

అడ్డుకుంటామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన మళ్ల విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్ లు గంటా తో చీకటి ఒప్పందం చేసుకుని శంఖుస్థాపన జరిగిన సమయంలో తమకు వచ్చిన

ప్యాకేజీలు లెక్కిస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. వీరిద్దరి పై ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు :
1  à°²à±‚లూ మాల్ నిర్మాణం పై గతంలో వ్యతిరేకించిన వీళ్ళిద్దరూ

ఇప్పుడు నోరెందుకు ఎత్తడం లేదు ?
2  à°ªà±à°°à°­à±à°¤à±à°µ భూ దందాలపై ఆధారాలున్నా మంత్రులు, ఎమ్మెల్యే లను ఎందుకు విమర్శించడం లేదు ?
3  à°µà°¿à°¶à°¾à°– లో ఎన్నో భూదందాలు చేసి, రౌడీ షీట్

ఉన్న ఎంవివి బిల్డర్ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ ఇంఛార్జిగా ఎందుకు నియమించారు.?
4  à°…ధికార పార్టీ అవినీతి పై ఎందుకు ప్రశ్నించడం లేదు ?
5  à°ªà°¾à°°à±à°Ÿà±€ నేతల తీరుకు

విసిగిపోయిన పార్టీ క్యాడర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతుంటే ఎందుకు నోరెత్తడం లేదు ?
6  à°ªà°¾à°°à±à°Ÿà±€ కార్యాలయం గుల్ల చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర

విలువైన సామాగ్రి అంతా వీళ్ళు తమ ఇళ్లకు పట్టుకుపోవడం వాస్తవం కాదా ?
 
తదితర కీలకమైన అంశాలపై వీళ్ళు ఎటువంటి స్పందన లేక, పూర్తిగా భాద్యతా రాహిత్యం వల్లనే

విశాఖ జిల్లా మొత్తం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని తుంగలోకి తొక్కేందుకు వీళ్ళు సాయ శక్తులా పనిచేస్తున్నారని, వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యకపోతే పార్టీ అతి

తొందరలోనే భూస్థాపితం అయిపోతుందన్నారు. వెంటనే పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిలు మేలుకోకపోతే పార్టీకి మనుగడ

లేకుండా చేయడం ఖాయమని హెచ్చరించారు. 

నేటికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రజాభిమానం తోనే పార్టీ అభ్యున్నతిని

కోరుకుంటున్నామని, అయితే స్థానిక చౌకబారు పనితీరుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిషత్తునే భూస్థాపితం చేసే స్థితి వచ్ఛేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
/> గతం లో జిల్లా అధికార ప్రతినిధిగా ఉంటూ, అధికార పార్టీ చేసే ఆగడాలు, దుర్మార్గాలను వెలికి తీసి, ఆధారాలతో మీడియా ముందు పెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని, వాటిల్లో

ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అక్రమాలు కూడా బయట పడ్డాయన్నారు. అయితే. తానూ సేకరించిన ఆధారాలను తుంగలోకి తొక్కుతూ మళ్ల విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్ నాద్ లాంటి

వాళ్ళ ఆగడాలు తట్టుకోలేకే పార్టీకి దూరమయ్యానని, ఇప్పడికీ వైఎస్ జగన్ à°•à°¿, రాజశేఖర్ రెడ్డి à°•à°¿ అభిమానినేనని తెలిపారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #ysr congress  #ysr cp  #peethala murty yadav  #peetala

murty  #ys jagan  #vijay sai reddy 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam