DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయాల్లో సంచలనం కేసీఆర్ :  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు  

హైదరాబాద్, సెప్టెంబర్ 6 , 2018 (DNS Online ):  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కె చంద్ర శేఖర్ రావు గురువారం మరో సంచలనానికి తెరతీశారు. తెలంగాణా

ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రము లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన

కేసీఆర్ సుమారు తొమ్మిది నెలల పదవి కాలం ఉండగానే అసెంబ్లీయే ని రద్దు చెయ్యాలని తీర్మానం చేసి, గవర్నర్ కు సిఫార్సు చెయ్యడం చాలా పెద్ద సాహసమే అవుతుంది.

ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందిన సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టయితే మరోసారి అధికారం లోకి రావచ్చు అని బలంగా నమ్మి ఈ బలవన్మరణ తీర్మానానికి

తెర లేపారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు కనీసం నోరెత్తే అవకాశం కూడా లేకుండా, వెంటనే రద్దు పై గవర్నర్ ఆమోదాన్ని కూడా సాధించగలిగారు. దీంతో ప్రస్తుతం తెలంగాణా

ఆపద్ధర్మ పాలనలోకి వెళ్ళిపోయింది. అతి త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ ని కూడా రద్దు చేస్తున్నట్టు గవర్నర్ భవన్ నుంచి ప్రకటన వెలువడనుంది. ఇతను ప్రత్యేక రాష్ట్ర

సాధన కోసం చేసిన ప్రయత్నాల్లో వాస్తవాలు ఉండవచ్చు, అవాస్తవాలు ఉండవచ్చు. అయితే ఈ క్రమం లోనే పలు మార్లు లోక్ సభ కు, శాసన సభకు కూడా రాజీనామాలు చేసి, ఉపఎన్నికల్లో

పోటీ చేసి మరీ గెలిచి, కేంద్ర ప్రభుత్వం లో మంత్రి పదవి కూడా చేపట్టిన సందర్భాలున్నాయి.  à°œà±‚న్ 2, 2014à°¨ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన

సంగతి తెలిసిందే. 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు తెలంగాణ తొలి ప్రభుత్వం కొనసాగింది. అయితే గురువారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ గవర్నర్ ను కలవనుంది. తెలంగాణాలో

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాల్సి యుంది.

 

#dns  #dnslive #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #visakhapatnam  #vizag  #hyderabad  #telangana  #kcr  #assembly 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam