DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిరివెన్నెల‌ కు కొప్పరపు జాతీయ పురస్కారం

విశాఖపట్నం, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): సుప్రసిద్ధ సినీ  à°—ేయ రచయిత  à°šà±‡à°‚బోలు (‘సిరివెన్నెల’)  à°¸à±€à°¤à°¾ రామ శాస్త్రికి ప్రతిష్ఠాత్మకమైన కొప్పరపు కవుల‌ జాతీయ ప్రతిభా

పురస్కారం-2018à°•à°¿ ఎంపికయ్యారు. à°ˆ నెల‌ తొమ్మిదో తేదీ ఆదివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో à°…à°‚à°—‌à°°à°‚à°— వైభంగా జరిగే శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 16à°µ వార్షికోత్సవ

సంద‌ర్భంగా కళాపీఠం వార్షిక జాతీయ పురస్కారాలు అందించనున్నారు. సీనియ‌ర్ à°œ‌ర్న‌లిస్ట్‌, పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ

శర్మ (మా శర్మ) ఆధ్వర్యంలో జరిగే వేడుకలో కొప్పరపు కవుల‌ జాతీయ ప్రతిభా పురస్కారం తోపాటు, à°—à°¤ ఏడాది నుంచి అవధాన రంగంలో విశేష కృషి చేసినవారికోసం నెల‌కొల్పిన

కొప్ప‌à°°‌పు à°•‌వుల అవధాన పురస్కారాన్ని à°ˆ ఏడాది డాక్టర్‌ కడిమెళ్ల వర ప్రసాద్‌ అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ (సృజనాత్మక, సాంస్కృత సమితి)

సౌజన్యంతో ఏర్పాటు చేసే à°ˆ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన భిన్న రంగాల‌ అతిరథ మహారధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల‌

అభివృద్ధిశాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ప్రత్యేక అతిథిగా దిvangata  à°¸à°¿à°¨à±€ దర్శకులు, దాదాసాహెబ్‌

ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్‌,  à°ªà±à°°à°–్యాత పత్రికా సంపాదకులు డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌

ఛీఫ్‌ సెక్రెటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెరవు రామకోటయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కె. రఘురామరాజు, విజయ్‌

నిర్మాణ్‌ కంపెనీ అధినేత డాక్టర్‌ సూరపనేని విజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కూటికుప్పల‌ సూర్యారావు ప్రియ అతిథులుగా హాజరై à°ˆ పురస్కారాల‌ను అందజేస్తారు. సభారంభంలో

ఘోరకవి సంపత్‌ కుమార్‌, ఆల‌మూరు రాధా కుమారి నారాయణ తీర్థుల‌ తరంగాల‌ను గానం చేస్తారు. మల్లాప్రగడ జోగులాంబ వీణపైన, ఎంవీఆర్ à°²‌క్ష్మణ రావు మృదంగంపైన వాద్య

సహకారమందిస్తారు. సాగరతీరంలో నెల‌కొల్పిన మేరు నగధీరులు కొప్పరవు వేంకట సుబ్బరాయ కవి (1885`1932) , కొప్పరవు వేంకట రమణ (1887`1942) జంటకవుల‌ విగ్రహాల‌కు పైన పేర్కొన్న ప్రముఖుంతా

ఉదయం పుష్ప నివాళుల‌ర్పించడంతో à°ˆ ఉత్సవాల‌కు లాంఛనంగా శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. లోగడ à°ˆ ప్రతిష్ఠాత్మక పురస్కారాలందుకున్నవారిలో పండిట్‌ శివ కుమార్‌ శర్మ,

పండిట్‌ జస్రాజ్‌, పద్మవిభూషణ్‌ పండిట్‌ హరిప్రసాద్ చౌరాసియా, డాక్టర్‌ మాడుగుల‌ నాగఫణి శర్మ, వేటూరి సుందర్రామ్మూర్తి, బేతవోలు రామ బ్రహ్మం, మేడసాని మోహన్‌,

మల్లాది చంద్రశేఖర శాస్త్రి, డాక్టర్‌ మంగళంపల్లి బాల‌ మురళీ కృష్ణ, ఎస్పీ బాల‌ సుబ్రహ్మణ్యం, కోట సచ్చిదానంద శాస్త్రి, గరికపాటి నరసింహారావు, à°•‌ళాత‌à°ª‌స్వి కె.

విశ్వనాథ్‌, సంగీత à°•‌ళానిధి డాక్టర్‌ నేదునూరి కృష్ణమూర్తి వంటి ఉద్ధండులున్నారు. à°•‌ళా, సాహితీ, సాంస్కృతిక ప్రియులంతా à°ˆ కార్య‌క్ర‌మానికి

ఆహ్వానితులేన‌న్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #visakhapatnam  #vizag  #andhra pradesh  #dns live  #dnsmedia  #dns media  #kopparapu kavulu  #telugu sahityam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam