DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకుల సమస్యలు పరిష్కరించండి : కోన రఘుపతి కి వినతి

విశాఖపట్నం, సెప్టెంబర్ 8 , 2018 (DNS Online): రాష్ట్రవ్యాప్తంగా కేటగిరి 3 ఆలయాల్లో విధులు చేస్తున్న అర్చకులు ఎదుర్కుంటున్న ఆర్ధిక, వృత్తిపరమైన సమస్యలను

పరిష్కరించారానికి సహకరించాలని కోరుతూ ఉత్తరాంధ్ర అర్చక సంఘాల ప్రతినిధుల బృందం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి కోరారు.

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితుల నేతృత్వం లోని బృందం

కలిసింది. ఈ సందర్బంగా దీక్షుతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ తాము ద్వితీయ శ్రేణి ప్రతినిధులుగానే

పరిగణింపబడుతున్నామన్నారు. ఆలయాలకు ఆదాయం లక్షల్లో వస్తున్నప్పటికీ అర్చకులకు కనీసం ఐదు వేల నెలసరి వేతనం కూడా ఇవ్వడానికి దేవాదాయ శాఖా ఇష్టపడడం లేదని, ఈఓ లు,

ఇతర సిబ్బందికి వేలాది రూపాయలు నెలసరి వేతనం తో పాటు, ఇతర అలవెన్సులు అందిస్తున్నారన్నారు. చాలా ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు అయ్యే ఖర్చు ను  à°•à±‚à°¡à°¾ కొన్ని

దేవాలయాల్లో అర్చకులే  à°­à°°à°¿à°‚చాల్సి వస్తోందన్నారు. తమ డిమాండ్ల సాధనకై దాదాపు మూడు నెలల కాలం తాము రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేశామన్నారు. అయినప్పటికీ

ప్రభుత్వం నుంచి గానీ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షుల నుంచి గానీ ఎటువంటి సహకారం లభించలేదన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి వచ్చామని, సమాజం లోని

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం ఆలయంలో అర్చనలు చేసే అర్చకులు మాత్రం దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బృందంలో ఉత్తరాంధ్ర

అర్చకుల సంఘం ప్రతినిధులు మురళీకృష్ణ, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #uttarandhra archaka sangham  #archakulu  #srinivasa dixitulu  #kona raghupati  #ysr congress  #mla

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam