DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైజాగ్ బైక్ వాసుల ప్రశ్నలకు యముడు పరార్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online): విశాఖ నగర రహదారుల్లో ద్విచక్రవాహనాలు నడుపుతున్న వాహనదారుల ప్రశ్నలకు యమధర్మ రాజు పరుగు లంకించుకున్నాడు. ఇది వాస్తవం. అవగాహన లో

భాగంగా à°’à°• యమ ధర్మరాజు పాత్ర ధారిని, చిత్రగుప్తుని పాత్రధారి లతో శాంతిపురం ట్రాఫిక్ కూడలి వద్ద  à°µà°¿à°¶à°¾à°–పట్నం 4 à°µ టౌన్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది శుక్రవారం

సాయంత్రం ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీటు బెల్టు లు ధరించాలని అవహగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వీరిద్దరూ రెడ్

సిగ్నల్ పడిన సమయంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు యమ లోకం కావాలా, హెల్మెట్ ధరిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే చాలామంది స్పందించారు.

వీరిలో ఒక యువకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక యమ ధర్మరాజు పాత్రధారి పరుగు లంకించుకున్నారు. హెల్మెట్లు పెట్టుకోమని ఆదేశాలు జారీ చేసే మీరు, రోడ్ల పై గోతులు

ఎందుకు పూడ్చడం లేదని ప్రభుత్వాన్ని ఎందుకు à°…à°¡à°—à°¡à°‚ లేదు అని అడగగానే, అది మా పరిధి కాదంటూ వెళ్లడం తటస్తించింది. 
ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది చేపట్టిన కృషిని

పలువురు అభినందించారు. ఇకపై తాము తప్పని సరిగా హెల్మెట్లు ధరిస్తామని, ప్రమాదాలకు తాము కారణం కాదని హామీ ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో 4 వ టౌన్ ట్రాఫిక్ సిబ్బంది

మాట్లాడుతూ ప్రజల్లో భాద్యతలను తెలియచేయడమే తమ ప్రధాన లక్ష్యమని, జరిమానాలు వెయ్యడం వలన, ఫైన్లు కట్టేస్తున్నారు తప్ప నిబంధనలు పాటించడం లేదని, ప్రధానంగా యువతీ

యువకులు ఈ రహదారి ప్రమాదాలకు కారణంగానూ, బాధితులుగానూ ఉంటున్నారన్నారు. ఏ విధంగానైనా నగర వాసులచే హెల్మెట్లు ధరింపచేయడం, సీటు బెల్ట్ లు ధరించపచేసేందుకి వివిధ

తరహాల ప్రయత్నం చేస్తున్నామన్నారు. తద్వారా విశాఖ నగరం రహదారి ప్రమాదాల రహితంగా మారాలి అని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam 

#traffic police  #yama  #chitra gupta  #awareness  #traffic signals

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam