DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబుకు బ్రాహ్మణులంటే గౌరవం లేదు: విజయవాడ బ్రాహ్మణా సంఘాలు 

200 మంది à°¤à±‹ బీజేపీ లోకి విజయవాడ బ్రాహ్మణా సంఘాల చేరిక 

విజయవాడ, సెప్టెంబర్ 14 , 2018 (DNS Online): అధికార పార్టీ ముఖ్యమంత్రి పైగానే, పార్టీ నేతలకు గానీ బ్రాహ్మణులంటే

ఏమాత్రం గౌరవం లేదని, విజయవాడ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం నేతృత్వంలో విజయవాడ బ్రాహ్మణ పురోహిత సంఘానికి

చెందిన 200 మంది సభ్యులు, బి.జె.పి సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

సమక్షంలో చేరారు. శుక్రవారం విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన ఓ కార్యక్రమం లో వీరంతా ఎ.పి లో బి.జె.పి బలోపేతం ద్వారా ఆంధ్రప్రదేశ్

సమగ్రాభివృద్ధిలో భాగం కావాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరినట్టు తెలియచేస్తున్నారు. 

పేదరికంలో కొట్టుమిట్టాడుతూ  à°…త్యంత దుర్భర జీవితాలను

గడుపుతున్న వీరి పట్ల తెలుగుదేశం పార్టీ కక్ష పూరిత చర్యల్లో భాగమే నగరం లోని 40 గుళ్ళు బలవంతంగా కూల్చివేయడమేన్నారు. 

గత ఎన్నికల సమయంలో బ్రహ్మణులకి

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా అరకొర నిధులు ఇస్తూ, విజయవాడలో సుమారు 40 దేవాలయాలను కూల్చి, బ్రాహ్మణులను, హిందూ సమాజాన్ని

దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపి, మన సంస్కృతిని, భారతీయతను కాపాడే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పార్టీలో చేరామని బ్రాహ్మణ సంఘం

అధ్యక్షుడు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారు, జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్

పురంధేశ్వరి గారు, తదితర నాయకులతో పాటు, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #guntur  #bjp; #kanna lakshminarayana #vijayawada  #brahmins  #brahmana


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam