DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాయిలాలు . . . బాబు గారి ఎన్నికల తాయిలాలు వచ్చేస్తున్నాయి 

వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : చంద్రబాబు, ఇన్నాళ్లు ఏంచేసారో ?
విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2018 (DNS Online ): మరో ఆరు నెలల కాలం లో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఆంధ్ర

ప్రదేశ్ లో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలైపోయాయి. గత ఎన్నికల్లో గుప్పించిన హామీలను గుడ్డిగా నమ్మిన ప్రజలు చంద్రబాబు నాయుడు అండ్ కో కు ఓట్లు కోకొల్లలు గా

గుద్ది పడేసారు. దీంతో నాలుగున్నరేళ్ల కాలం పాటు ఆ హామీలను ఒక కట్టకట్టి గోదాము లో పడేసారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ గోదాం లోని పాత మూటని పైకి తీశారు.

దీనిలో భాగంగానే నిరుద్యోగులకు 20 వేల  à°ªà±‹à°¸à±à°Ÿà±à°²à°¨à± భర్తీ చేసేందుకు ఆదరాబాదరాగా  à°ªà±à°°à°•à°Ÿà°¨ విడుదల చేసేసారు. à°—à°¤ ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం

చేసి, ఓట్లు గుంజుకున్నారు. గెలిచాక, వాళ్ళ బాబు ( లోకేష్ బాబు) కి తప్ప ఎవ్వడికీ ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా కోట్లు గుమ్మరించి కేంద్రాన్ని తిట్టడమే పనిగా

పెట్టుకున్నారు. 

ఇప్పుడే ఎందుకు భర్తీ ?

ఈ ఉద్యోగాలు హఠాత్తుగా ఖాళీ అయినవి కావు. గత ఎన్నికల సమయం నాటికే లక్షకు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలోని వివిధ

ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాకుండా మిగిలి ఉన్నాయి. పైగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. కనీసం కొన్ని పోస్టుల నైనా భర్తీ చేయండి

మహాప్రభో అని అధికారులు మొత్తుకున్నా, పట్టించుకోని చంద్రబాబుకు, నేడు ఒక్కసారిగా ప్రజలపై మోజు పెరిగిపోయింది. అయితే ఈ పోస్టులను కూడా ఎన్నిక హంగామాగానే

ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అదే నిజంగా తేలనుంది. ఈ ప్రకటన వచ్చేదెన్నడు ? దానికి ప్రక్రియ మొదలయ్యేదెప్పుడు ? దరఖాస్తులు స్వీకరణ ఎప్పుడు

? పరీక్షల నిర్వహణ ఎప్పుడు జరిగెను ? తదుపరి ఫలితాలు? à°† పై ఇంటర్వ్యూలు ( ఉంటె ), అప్పుడు నియామకాలు.  à°ˆ లోగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం అయ్యిందో .... అంతే గతి. నిరుద్యోగులు

బ్రతుకు బస్టాండే...  

ఈ నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు చంద్రబాబు అండ్ కో భారీ గండి కొట్టేందుకు పన్నిన ఎన్నికల ప్రణాళికలో ఇది ఒక

మంత్రాంగం మాత్రమే. అయితే దీనికి వాస్తవ రూపం కల్పిస్తే మంచిదే.. అయితే అలా జరగాలి అంతే వీళ్లకు నిబద్దత ఉండాలి. అది ఉన్నట్టుగా కనపడడం లేదు. అదే ఉంటె. ఈ నియామకాలు

గత నాలుగేళ్ల కాలం లో ఎందుకు చేపట్టలేదు. అప్పుడు కూడా ఇవే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇది కేవలం ఎన్నికల స్టంట్ గానే కనపడుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల

ప్రచారం లో దూసుకు వెళ్తుండడం తో అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో గత్యంతరం లేక నిరుద్యోగులను పావులుగా వాడుకుంటోంది అన్నది వాస్తవం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam