DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిమ్మన్న రచన - యుగకర్త గురజాడ  గ్రంథావిష్కరణ

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018  (DNS Online ) : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం తెలుగు విభాగ విశ్రాంత అధ్యాపకులు వెలమల సిమ్మన్న à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ ‘యుగకర్త`గురజాడ’

గ్రంథాన్ని వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్  à°°à°¾à°®à±à°®à±‹à°¹à°¨à°°à°¾à°µà± ఆవిష్కరించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ గురజాడ జయంతి సందర్భంగా ఆధునిక సాహిత్య దినోత్సవాన్ని

పురస్కరించుకుని వర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో  à°œà°°à°¿à°—à°¿à°¨ కార్యక్రమం లో ఆయన అతిధిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯, సామాజిక

రంగాల్లో కొత్త యుగానికి నాంది పలికిన విశిష్ట వ్యక్తిగా గురజాడ అప్పారావు నిలుస్తారన్నారు. గురజాడ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ ‘కన్యా శుల్కం ’ ప్రపంచంలోనే అత్యుత్తమ నాటకంగా

పేరొందడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. అటువంటి మహనీయుని ఆధునిక సాహిత్యానికి యుగకర్తగా పేర్కొంటూ పుస్తకరచన చేయడం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత

వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆధునిక సాహిత్యానికి యుగకర్త ఎవరనే విషయంలో భిన్నాభిప్రాయాలను ఛేదించడానికే పుస్తక రచన చేసినట్లు వివరించారు. సామాజిక, సాహిత్య

రంగాకు శస్త్రచికిత్స చేసిన గురజాడే యుగకర్తగా సరైన వ్యక్తి అన్నారు. కన్యా శుల్కం, పూర్ణమ్మ వంటి రచనతో విషసంస్కృతి, మూఢాచారాను పారదోలుతూ విస్తృత

సమాజాభ్యుదయాన్ని ఆయన కాంక్షించారన్నారు. ప్రజలకు పట్టంగట్టే భాషకు ప్రాణం పోయడం, నూతన ఛందస్సు సృష్టించడం, తన రచన ద్వారా సామాజిక రుగ్మతను పారద్రోలడం వంటి

విభిన్న పాత్రను గురజాడ పోషించారన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి చరిత్ర  à°µà°¿à°­à°¾à°—à°‚ విశ్రాంత డాక్టర్  à°µà±†à°‚కటేశ్వరరావుకు అందజేశారు. అనంతరం గ్రంథకర్త సిమ్మన్న,

సాహితీవేత్త డాక్టర్‌ పేరి రవికుమార్‌ను తెలుగు  à°µà°¿à°­à°¾à°— అధ్యాపకులను ఘనంగా సమ్మానించారు. కార్యక్రమానికి  à°†à°šà°¾à°°à±à°¯ మద్దుపల్లి దత్తాత్రేయ శాస్త్రి అధ్యక్షత

వహించారు. à°ˆ కార్యక్రమంలో విభాగాధిపతి జర్రా అప్పారావు, కొండపల్లి సుదర్శనరాజు, ప్రముఖ రచయిత రామతీర్థ, డాక్టర్‌ కెఎన్‌ మల్లీశ్వరి, విభాగ పరిశోధకులు,

విద్యార్థులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #vizag  #visakhapatnam  #vizianagaram  #gurajada apparao  #kanyashulkam
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam