DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు, వదులుకోవద్దు: కలెక్టర్  

ఓటు నమోదు కు గడువు అక్టోబర్ 31, పూర్తి జాబితా జనవరి 3 à°¨ విడుదల    
విశాఖపట్నం, సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ): భారత దేశ రాజ్యాంగం 18 సంవత్సరాలు ప్రతి పౌరునికి కల్పించిన హక్కు ఓటు

వెయ్యడం, అని దాన్ని ఎవరూ వదులుకోవద్దు అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని వాటిలో ఓటు వేసి సమర్థులైన అభ్యర్థులను చట్టసభలకు పంపవలసిన భాద్యత

భారత దేశ పౌరులపై ఉందన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టు లో తమ పేరు ఉందొ లేదో పరిశీలించుకుని, లేని పక్షంలో తప్పనిసరిగా నందు చేయించుకోవాలన్నారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కొత్త గా నమోదు చేసుకునే వారు, ఓటర్ల లిస్ట్ లో

తప్పులు గమనించినవారు సవరణకు ఓటరు నమోదుకు ఆన్ లైన్ ద్వారా గాని, సమీపంలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కేంద్రం లో గాని వివరాలను అందించి

తమ పేర్లను ఓటరు లిస్ట్ లో నమోదు చేసుకోవచ్చన్నారు. కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల పేర్లలో మార్పులు చేర్పులతో సంపూర్ణ వివరాలను బూత్ స్థాయి నుంచి

పటిష్ఠపరుస్తున్నామన్నారు. 
 à°ˆ నమోదు ప్రక్రియ నవంబర్ 30 నాటికి పూర్తి చేస్తామని, జనవరి 3 ,2019 నాటికి కొత్త కార్డులు ముద్రణకు పంపించనున్నామని, జనవరి 4 , 2019 తేదీ నాటికి

ఓటరు కార్డులను లబ్దిదారులకు అందిస్తామన్నారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల

ప్రతినిధులతో సమావేశమై, వారు నిర్వహించవలసిన భాద్యతలను తెలియ చేశారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #collector  #praveen kumar  #election commission  #voter list  #enrolment
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam