DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మన్యం లో మావోల విజృంభణ - అరకు ఎమ్మెల్యే కిడారి మృతి.

మావోల పంజాకు, అరకు ఎమ్మెల్యే కిడారి దుర్మరణం. 

విశాఖపట్నం, సెప్టెంబర్ 23 ,2018 (DNS Online ): మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుండడంతో మావోయిస్టులు ఒక్కసారిగా

విజృభించినట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టు లు జరిపిన దాడిలో విశాఖ జిల్లా అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర

రావు మరణించారు. గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న మావోయిస్టు ల కదలికలు, ఈ ఘటనతో విశాఖ మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జిల్లాలో పోలీసులు గత కొన్ని నెలలుగా

విస్తృతంగా తనిఖీలు చేసి, సానుభూతి పరులను, మిలీషియా బృందాలను అదుపులోకి తీసుకుని, వీరి కదలికలకు బ్రేక్ వెయ్యడంతో తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

వీళ్ళు దండకారణ్యం ద్వారా ఛత్తీస్ ఘర్, తెలంగాణ, ఒరిస్సా తదితర ప్రాంతాలకు తరలిపోతున్నారు అనుకునే సమయంలో విశాఖ మన్యంలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా కాల్పిచంపారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో మాజీ

ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మరణించారు. 

హోమ్ శాఖా మంత్రి దిగ్భ్రాంతి :

అరకు లోయ శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టు ల దాడి లో మృత్యువాత పడడం

పై రాష్ట్ర హోంశాఖ మంత్రి à°šà°¿à°¨ రాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  à°µà±†à°‚టనే అయన  à°˜à°Ÿà°¨à°¾à°¸à±à°¥à°²à°¾à°¨à°¿à°•à°¿ బయలుదేరారు. విదేశీ పర్యటనకై సిద్దమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు à°ˆ ఘటన పట్ల విస్మయానికి గురయ్యారు. 

జగన్ కు ఝలక్ ఇచ్చిన కిడారి...

రాజకీయ పరంగా ఏమాత్రం బలం లేని కిడారి సర్వేశ్వర రావు ను ఆదరించి, శాసన సభ్యునిగా

అవకాశం కల్పించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి గట్టిగా గుణపాఠం చెప్పాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినా

కిడారి, కొంతకాలం బాగానే ఉన్నాడు, జగన్ మోహన్ రెడ్డి కూడా అవసరానికి మించి నమ్మడం కూడా జరిగింది. అయితే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పోయో భయపడో ఒక్కసారిగా

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం లోకి జంప్ చేసేసారు. దీంతో పార్టీ క్యాడర్ లో ఇతనిపై వ్యతిరేకత పెరిగింది. మరో ఆర్నెలల్లో సార్వత్రిక ఎన్నికలు

రానున్న నేపథ్యంలో ఇతను మృత్యువాత పడ్డారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #araku  #mla  #kidari sarveswara rao  #YSR Congress  #Telugudesam  #TDP


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam