DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంకల్ప యాత్ర ఫుల్ - ఫలితం నిల్,  జగన్ కు మిగిలేది కాళ్ళ నొప్పులేనా ? 

సంకల్పానికి స్వీయ అవరోధాలే 

పాదయాత్ర ఫుల్ - ఫలితం నిల్ , 

జగన్ కు మిగిలేది కాళ్ళ నొప్పులేనా ? 

విశాఖపట్నం, సెప్టెంబర్ 23 , 2018 (DNS Online ): ప్రజా సంకల్పం పేరిట

నెలల తరబడి రోడ్లు పట్టుకు తిరుగుతూ  à°®à±‚డు వేల కిలోమీటర్ల దూరం మైలు రాయి దాటుతున్న నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ చివరకు మిగిలేది కాళ్ళ నొప్పులేనా అంటే

అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీనికి వత్తాసు పలుకుతున్నాయి ఇతర రాజకీయ పార్టీలు. à°’à°• 
బృహత్తర సంకల్పం తో ఇడుపులా పాయలో ప్రారంభించిన ఈ యాత్రలో ఎన్నో

ఘటనలు, సత్కారాలు, ఛీత్కారాలు కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకునిగా ఇతను చేపట్టవలసిన భాద్యతలను

నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం అయ్యారు. అయితే ఇది ఈయన ఒక్కరి నిర్ణయమని చెప్పలేము. ఈయనకు  à°…ండదండ à°—à°¾ ఉన్న పార్టీ లోని సీనియర్ వర్గాలు ఈయనకు ఇచ్చే సలహాలు, సూచనలు,

ఈయన్ని పూర్తిగా ఊబిలోకి తీసుకుపోతున్నాయి అన్నది వాస్తవం. 

పార్టీ లో కొత్త వింత  - పాత రోత  

పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడిన

నేతలు, కార్యకర్తలను తుంగలోకి తొక్కి, కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో వైఎస్ జంగమోహన్ రెడ్డి పట్ల పూర్తి నైరాశ్యం

పేరుకుపోయింది. పైగా ఇంతకాలం పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తూ, కార్యకర్తలను పోషిస్తూ, లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన నేతలను నేడు పార్టీ నుంచి బయటకు పంపే

కార్యక్రమం సిద్ధమైపోయింది. పొమ్మనలేక పొగబెడితే వాళ్ళే పోతారు అన్న రీతిలో జగన్ అండ్ కో తీరు సాగుతోంది. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, పార్టీలో జగన్ కు అత్యంత

సన్నిహితంగా మెలిగి, పార్టీ అభివృద్ధి పాటుపడ్డ సీనియర్ నేతలే చెప్తున్నా వాస్తవాలు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో  2014 లో పార్టీ లో ఉంది, ఎన్నికల బరిలో

నిలబడిన పార్టీ అభ్యర్థులను నెత్తిన బెట్టుకున్న వందలాది మంది కార్యకర్తలు నేడు పార్టీని వీడిపోయారు. వైఎస్ కు భక్తులుగా ఉన్నవారిని సైతం బెల్టు తీసి బయటకు

పంపేసిన ఘటనలు ఈ రాష్ట్ర ప్రజలు చూసారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రానున్న తరుణంలో కోట్లు ఖర్చుపెట్టగలిగిన వాళ్లకి భలే తాయిలాలు ఇచ్చి పార్టీలోకి లాక్కుంటున్న

ఘటనలు చూస్తున్నాం. వీళ్లకు పోటీ గా ఉన్నవారిని బయటకు పంపేలా కొన్ని హెచ్చరికలు కూడా జరీ అవుతున్నట్టు తెలుస్తోంది. నీ దగ్గర కోట్లు ఉన్నాయా? ఎన్నికల్లో ఖర్చు

చేయగలవా ? అతనైతే జిల్లాలో ఖర్చు భరించగలడు అంటూ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలను మీడియా ముఖంగా బహిష్క్హృత నేతలే చెప్తున్నా

వాస్తవాలు. 

వై ఎస్ జగన్ కు ఉన్న మీడియా ఫాబియా మైనస్.

మూడు వేల కిలోమీటర్ల కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేసినప్పడికీ ఎక్కడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 à°ªà°¤à±à°°à°¿à°•à°¾ ముఖంగా సమావేశాలు ఎదుర్కోలేక పోవడం à°ˆ ప్రజా సంకల్ప యాత్ర ఘోర వైఫల్యాన్ని తెలియచేస్తోంది. అతనికి మీడియా ఫోబియా ఉన్నందునే మీడియా ను ఎదుర్కొనే ధైర్యం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెయ్యలేక పోతున్నారు, అని మీడియా వర్గాలు బహిర్గతంగానే ప్రకటిస్తున్నాయి. విశాఖపట్నం ను అత్యంత ప్రతిష్ట్మాకంగా భావించే వైఎస్ జగన్

మోహన్ రెడ్డి, కనీసం విశాఖ లో కూడా మీడియా ను ఎదుర్కొనే ధైర్యం చెయ్యలేక పోయారు. ప్రధానంగా తన లక్ష్య సాధన లో తానూ ఎదుర్కొంటున్న సాధక బాధలను మీడియా పరంగా

తెలియచేస్తే, ప్రజలకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. పైగా ఈ రాష్ట్రం లో జరుగుతున్న ఎన్నో అంశాలపై అయన ప్రతిపక్ష నేతగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. పైగా

ప్రతిపక్ష నాయకునిగానే  à°®à±€à°¡à°¿à°¯à°¾ తో  à°¤à°¨ ఆలోచనలు పంచుకోలేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక అధికారం లోకి వస్తే మీడియా ని పూర్తిగా నిషేధం చేస్తారు అనే ప్రచారం

విస్తృతంగానే సాగుతోంది. 

కేవలం వన్ సైడ్ ప్రసంగాలే. .

మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలన్నీ కేవలం వన్ సైడ్

ప్రసంగాలే జరుగుతున్నాయి. నియోజక వర్గం లో ఒక బహిరంగ సభ పెట్టి ఎవరో వ్రాసి ఇచ్చిన లేఖలను చదవడం తప్ప, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, ఎదుర్కొనే ప్రధాన సమస్యల పై

స్పందించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు జగన్. 

ఈ తప్పిదం యాత్ర నిర్దేశకులదే.

ఈ పాదయాత్ర లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సరైన మార్గదర్శకం చెయ్యవలసిన

పార్టీ వర్గాలు, సీనియర్ నేతలు, సలహాదారులు ఘోరంగా వైఫల్యం చెందారు అని చెప్పడానికి ప్రజల్లో తలెత్తిన వ్యతిరేక పవనాలే. ఆయన నిరంతరం పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి

వెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వెనకాల భజన బృందాలు వైఫల్యం వాళ్ళ 13 జిల్లాల పాదయాత్ర తర్వాత మిగిలేది కేవలం కాళ్ళ నొప్పులు మాత్రమే. ఇప్పడికైనా ఈ భజన బృందాలను మార్చి,

జగన్ మోహన్ రెడ్డి లోని తప్పొప్పులు సరిదిద్ది, మంచి మార్గదర్శకం చెయ్యగలిగిన వారిని నియమించుకుంటే తప్ప వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యం

నెరవేరే అవకాశం మాత్రం లేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam