DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోమయాజులు కమిషన్ నివేదిక లో సంతకం ఆయనదేనా ? ఉండవల్లి

హిందూ విశ్వాసాలను తప్పు పట్టింది : ఉండవల్లి. 

చార్జిషీట్ వేస్తె మొదటి పేరు బాబుదే ఉండాలి

à°ˆ కమిటీ నివేదిక  à°à°•à°ªà°•à±à°· నిర్ణయం మాత్రమే. .

రాజమండ్రి,

సెప్టెంబర్ 21 , 2018 (DNS Online ) : గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనపై సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేదికపై చేసిన సంతకం జస్టిస్ సోమయాజులదేనా అనే అనుమానం కూడా వచ్చిందని, మాజీ

ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమని, అయితే దీనిపై నియమించిన ఏకపక్ష

కమిటీ, హిందూ విశ్వాసాలను తప్పు పడుతూ ఏకపక్ష నివేదిక ఇచ్చేసిందన్నారు. దీనిపై కమిటీ పుష్కర ప్రారంభ సమయాన్ని తప్పు పట్టిందని, దీనిపై అక్కరలేని ప్రచారం

చేసినట్టు à°—à°¾ 
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు ను, వీటిని దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలను తప్పు పట్టియిందన్నారు. అయితే దీన్ని ఉండవల్లి తప్పు

పట్టారు. ఈ కమిటీ హిందూ సంప్రదాయ విశ్వాసాలను కించపరించిందన్నారు. ప్రధానంగా ఈ ఘటనపై చార్జిషీట్ దాఖలు చేస్తే మొదటి పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దే

ఉంటుందన్నారు. కారణం పుష్కరాల ప్రారంభ సమయాన్ని ఖరారు చేసింది ముఖ్యమంత్రేనన్నారు. 
ఈ ఘటనపై చార్జిషీట్ దాఖలు చేస్తే మొదటి పేరు చంద్రబాబు దే ఉంటుందని, తదుపరి

ముహూర్త బలం అంటే ఏంటో ప్రజలకు తెలియచెప్పిన చాగంటి లాంటి ప్రవర్తన కర్తలపైనా, ప్రచారం కల్పించిన మీడియా పైనా చార్జిషీట్ దాఖలు చెయ్యాల్సియుంటుందన్నారు. అయితే,

కనీసం ఒక్క హోంగార్డు పై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. నాటి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, ముఖ్యమంత్రి సుమారు గంటన్నర సమయం పుష్కరాల

రేవులో ఉండిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇచ్చిన ప్రాధమిక నివేదిక ను కూడా సోమయాజులు కమిషన్ కనీసం చూడడం కూడా జరగలేదన్నారు. పైగా ఆ సమయం లో రాజమహేంద్ర వరం లోని

మిగతా రేవులన్నీ ఖాళీ అని, అందరినీ కేవలం పుష్కరాల రేవుకే తరలించాలని ఆదేశాలిచ్చారన్నారు. ప్రచారం చేసుకోవడం మంచిదేనని, అయితే ప్రచారం పిచ్చి బాగా ముదిరిపోయి

నేషనల్ జాగ్రఫికల్ ఛానల్ లో డాక్యుమెంటరీ కోసం 29 మందిని బలి తీసుకునేంతగా తయారైందన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #chandrababu  #cbn  #chandra babu  #godavari   #pushkaralu  #Vundavalli Arun  #Rajahmundry

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam