DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యకు భాద్యులు ప్రభుత్వమే : ఎమ్మెల్సీ మాధవ్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరా రావు, మాజీ ఎమ్మెల్యే సోమా ల హత్యకు భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే నని ఉత్తరాంధ్ర

పట్టభద్రుల ఎంఎల్ సి పివిఎన్ మాధవ్ మండిపడ్డారు. గురువారం నగరం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ, మన్యం

ప్రాంతం లో ప్రజా ప్రతినిధుల ప్రాణాలకు రక్షణ లేదు అని తెలిసి కూడా పోలీసు వర్గాల ఉదాసీనతకు ఫలితమే ఈ దమనకాండ అన్నారు. ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవలసిన

ఇంటిలిజన్స్ విభాగం చేత  à°¤à±†à°²à°‚గాణాలో పనిచేయింస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై మండిపడ్డారు. అక్కడ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం

పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, అసలు ఎన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయో కనుక్కోమంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉద్యోగులను అక్కడికి పంపడం ఏంటన్నారు.

అధికార పార్టీకి చెందిన వారికే తగిన భద్రతా కల్పించని తెలుగుదేశం ప్రభుత్వం ఇక సామాన్యులకు ఏమి భద్రతా కల్పిస్తుందన్నారు. మావోయిస్టు ల వారోత్సవాలు

జరుగుతున్న సమయంలోనే గ్రామ దర్శిని  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ మన్యం లో చేపట్టడం ఏంటని, à°ˆ కార్యక్రమం లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పై ఒత్తిడి తేవడం

దారుణమన్నారు. సౌమ్యులుగా పేరు పొందిన వీరిద్దరిని టార్గెట్ చేసినట్టు గతంలోనే వార్తలు వచ్చాయనే విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసు ఉంటుందని, అలాంటప్పుడు తగిన

భద్రత ఎందుకు ఇవ్వలేదన్నారు. ఇదే మన్యం లో మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి, ప్రజల్లో చైతన్యం కల్పించిన బీజేపీ కార్యకర్తలను 47 మంది ని

హత్యచేశారన్నారు. విభేదం కల్గితే మట్టు పెట్టడమే అనే విధానం సరైనది కాదన్నారు. రాష్ట్ర పోలీసు విభాగం వైఫల్యం మరోసారి బట్టబయలయ్యిందన్నారు. ప్రధానంగా ఆంధ్ర

 à°’రిస్సా సరిహద్దులో à°ˆ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #mlc  #pvn madhav  #MLA assassination  #araku  #dumbriguda  #bjp #press meet 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam