DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ కి మిగిలేది కాళ్ళ నొప్పులే : మంత్రి గంటా . . . .

#dns #dnslive #dns live #dnsmedia #dns media #dnsnews #dns news #vizag  #visakhapatnam 
href="https://www.facebook.com/hashtag/ysr?source=feed_text">#ysr congress  #ys jagan #ganta srinivasa rao #ganta #land scams

">

రోడ్డు పై నడిచేది తక్కువ, కోర్టు మెట్లు ఎక్కేది ఎక్కువ . . .. ఇదీ జగన్ యాత్ర తీరు 
విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): రోడ్లు పట్టుకు తిరుగుతూ మూడు వేల కిలోమీటర్లు

నడిచానంటూ ఆర్భాటాలు చేసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మిగిలేది కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులే నని రాష్ట్ర

మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ కాళ్ళు ఉన్నాయి కదా అని

రోడ్లు పట్టుకు నడుస్తున్నారని, దాని వల్ల ఎవరికీ లాభమని, మూడు వేలు నడిచామా, ముప్పై వేలు కిలోమీటర్లు నడిచామనేది కాదని, దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని

ప్రశ్నిచారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు పాదయాత్రలో ప్రజా సమస్యలను, కష్ఠాలను, తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఫలితంగా రైతులకు ఉచిత విద్యుత్ , 108 ఆరోగ్య

శ్రీ పధకాలు వచ్చాయని, వాటివల్ల ప్రజలకు కొంత మీరు జరిగిందన్నారు. అదే విధంగా చంద్రబాబు చేసిన పాదయాత్ర ఫలితంగా  à°°à±ˆà°¤à± రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి

లు అమలు లోకి వచ్చాయన్నారు. 

ఆత్మ స్తుతి - పర నింద ఇదే గోల 

à°ˆ యాత్రలో చేపట్టే రోడ్డు పక్కన పెట్టె  à°ªà±à°°à°¤à°¿ బహిరంగ సభల్లో  à°•à±‡à°µà°²à°‚ జగన్ మోహన్ రెడ్డి చేసే

ప్రతి సభలోనూ సొంత గొప్ప ( ఆత్మస్తుతి) చేసుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ను, ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, వాళ్ళ వారసులని తిట్టడం (  à°ªà°°à°¨à°¿à°‚à°¦) తప్ప మరొకటి

లేదన్నారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరిపైనా నిరాధారమైన ఆరోపణలు చెయ్యడమే పనిగా చేసుకున్నారన్నారు. 

à°ˆ హామీలు సాధ్యమేనా ? 
అసాధ్యమైన హామీలు ఇస్తూ ప్రజలను

మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విశాఖ పట్నం జిల్లా లో  278 కిమీ నడిచారని, à°ˆ జిల్లాలో ఎక్కడైనా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ గురించిన ప్రస్తావన ఉందా అని

ప్రశ్నించారు. కనీసం ఏనాడు రైల్వే జోన్ కావాలి అని à°…à°¡à°¿à°—à°¿à°¨ పాపాన పోలేదన్నారు. 

అవినీతికి కేరాఫ్ అడ్రస్ వై ఎస్ జగన్ :

నవంబర్ 6 2017 న ఇడుపులా పాయలో మొదలైన

పాదయాత్ర లో ఇప్పడికి మొత్తం 330 కి పైగా రోజులు దాటినా ఈయన కేవలం 272 రోజులే పాదయాత్ర చేశారని, దీనికి కారణం అందరికీ తెలుసునని ప్రతీ శుక్రవారం ఈయన కోర్టుకు హాజరు

కావాల్సి ఉందన్నారు. ఈయన రోడ్డుపై నడిచేది తక్కువ, హైదరాబాద్ లోని కోర్టు గుమ్మం మెట్లు ఎక్కేది ఎక్కువ అని హేళన చేశారు. ఈయన కోర్టు గుమ్మం తొక్కేది స్వాతంత్ర

పోరాటం లో పాల్గొని కాదని, ఆయన తండ్రి ముఖ్యమంత్రి గా ఉండగానే ఇతను చేసిన కార్యాచరణకు ఫలితాలే ఈ అవినీతి ఆరోపణలే అన్నారు. అందుకే అతను ప్రతివారం ముద్దాయి గా

బోనులో నుంచిని వస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లే ఈయన, శనివారం వచ్చి అవినీతి కి వ్యతిరేకంగా

మాట్లాడాతున్నారు. 

క్విడ్ ప్రోకో అనే పదాన్ని భారత్ తెచ్చిన ఘనత జగన్ దే.

ఎన్నో ఆర్ధిక నేరాల గురించి భారత దేశ ప్రజలు విన్నారు కానీ క్విడ్ ప్రోకో అనే

పదం తెలియని భారతీయులకు పరిచయం చేసిన వ్యక్తి   వై ఎస్ జగన్ మోహన్ రెడ్డే అని à°—à°‚à°Ÿà°¾ ఎద్దేవా చేశారు.  à°¤à°‚డ్రి అధికారం లో ఉంటెనే ఇంత హంగామా చేశారు, మరీ మీకే అధికారం

వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు.  à°‡à°¨à±à°¨à°¿ ఆరోపణలు ఎదుర్కొంటున్న వై ఎస్ జగన్ కు రానున్న ఎన్నికల్లో మిగిలేది కేవలం ఒళ్ళు నొప్పులు,  à°•à°¾à°³à±à°³ నొప్పులే తప్ప

మరొకటి కాదు. అన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖ దక్షిణ శాసన సభ్యులు, తెలుగు దేశం పార్టీ నగర అధ్యక్షులు వాసుపల్లి గణేష్, గాజువాక ఎమ్మెల్యే పల్లా

శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns #dnslive #dns live #dnsmedia #dns media #dnsnews #dns news #vizag  #visakhapatnam 
href="https://www.facebook.com/hashtag/ysr?source=feed_text">#ysr congress  #ys jagan #ganta srinivasa rao #ganta #land scams

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam