DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానసిక వైద్యుని కలం నుంచి మహత్తర అక్షర సత్యాలు

సంకలనాలు పూర్వీకులకు అంకితం చేసిన డాక్టర్ విజయ గోపాల్.
విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2018 (DNS Online ): మానవ సమాజం లోని మానసిక రుగ్మతలు, కీలక సమస్యలకు పరిష్కారాలను కేవలం

వైద్యం ద్వారానే కాకుండా, రచనల ద్వారా కూడా సూచించవచ్చు అని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మోపిదేవి విజయ గోపాల్ చేసిన రచనా ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది అని,

ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. విశాఖనగరం లోని పౌర గ్రంధాలయం లో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యవం లో శనివారం జరిగిన కవితా సంకలనాల

ఆవిష్కార సభకు ముఖ్య అతిధిగా హాజరైన వారు మాట్లాడుతూ . . . అఖిల భారతీయ సాహితీ పరిషత్ ఆధ్వర్యవం లో సాహితీ సభలను నిర్వహించి, విభిన్న వృత్తుల్లో ఉంటూ, తమకు నిత్యం

ఎదురయ్యే ప్రతీ ఘటనను రచనాంశం గా స్వీకరించడం విజయ్ గోపాల్ గొప్పతనమన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీ వేత్త డివి సూర్యారావు మాట్లాడుతూ వైద్య

వృత్తి లో ఉంటూ ప్రజా సేవ చేస్తూ, మరో ప్రక్క సాహితీ సేవ అందిస్తున్న విజయ్ గోపాల్ అభినందనీయులన్నారు. రెండు విభిన్న దృక్పధాలలో సంచారం చేస్తూ అందరి మన్ననలూ

అందుకుంటున్నారన్నారు.

వంశ పూర్వీకులకు అంకితం :

" నాకో జీవితం ఇవ్వండి " సంకలనం విజయ్ గోపాల్ తన తల్లిదండ్రులు మోపిదేవి రామ్మూర్తి, జానకి లకు అంకితం

చేయగా, నాల్గవ సంకలనం " నాదీ మట్టి పోరాటమే" ను తన ముత్తాత గురజాడ అప్పారావు కు అంకితం చేసినట్టు వివరించారు.

" నాకో జీవితం ఇవ్వండి " :

ఈ కవితా సంకలనాన్ని

అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య చందు సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . . . .


ఈ సంకలనాన్ని ప్రముఖ కవయిత్రి జగద్ధాత్రి

సమీక్షించారు. సామాన్య మానవుల మనసులు సైతం ద్రవించేలా ఈ రచన సాగిందన్నారు.

ఎన్నెన్నో ఉగాదులు, వసంతాలు చూసి, ఎదుర్కొన్న సమస్యలకు అక్షర రూపం కల్పించింది ఈ

కవితా సంకలనం. ఈ సంకలనం లో చోటు చేసుకున్న కధాంశాల్లో మచ్చుతునకలివే. . . .
వైద్యున్ని దేవునిగా కాదు మనిషిగానే చూడండి అని, కరచాలనం పై - మాయ రోగం అంటూ, తలబొప్పి పై -

హెల్మెట్ ధారణ పై కవిత, తల్లి వాత్సల్యం పై - ఎందుకీ ఆరాటం, తెలుగు భాష ప్రభావం పై - పాశ్చాత్య పోకడల పై రచన, బాలికలపై దాడులను తెలియచెప్పే హృదయ ఆవేదన, రోడ్డు మీద

వెళ్తున్న మానసిక వ్యాధిగ్రస్తుని మానసిక వ్యధ. ఆధారంగా చేసిన కవిత సంకలనం.
మరి కొన్ని మచ్చుతునకలు : - రావణుని కి కంటే ఉన్మాది ప్రేమికుడు, రావణుడే నయం, కీచకుడే

నయం, అనే తీవ్రవాద సిద్ధాంత వ్యతిరేక రచన, బృందావనం లో - మంచి ప్రవర్తనే చిరు దీపం వెలిగించాలి, రక్షా బంధనం - దీక్ష పూనుదాము రండి అని, జనవరి 1 నాటి కేకలు కంటే ఉగాది

నాటి వేప పూత చాలు, ఉగాది అనే సంపుటి, తీవ్రవాద వ్యతిరేకత పై చేసిన రచనే - ఆ నలుగురు, వేచి చూడడం పై కాలం తో - మరో సాయంత్రం, ఎవరో వస్తారని, గ్రంధాలయ వైశిష్ట్యాన్ని

తెలియచెప్పే పుస్తకం - మస్తకం, శారీరిక ఆరోగ్యం - మానసిక ఆరోగ్యం తెలియచేసిన కల రచన సమస్య ను కూకటి వేళ్ళతో తొలగిస్తారని భావం తో తదితర అంశాలతో కూడుకున్న కవితా

సంకలనం - నాకో జీవితం ఇవ్వండి.


రచయిత మానసిక వైద్యులు డాక్టర్ విజయ గోపాల్ మాట్లాడుతూ సుమారు ఎనిమిదేళ్ల తర్వాత విడుదలచేసిన 3 వ కవితా సంకలనం ఇది అని తెలిపారు.

మొట్టమొదటగా సుదర్శనం, తదుపరి దిగ్దర్శనం విడుదలయ్యాయన్నారు. తాను రచించే ప్రతీ సంకలనం మానవాళి మానసిక స్థితిగతులను ఆధారంగానే సాగుతుందన్నారు. అనేక రకాల

సామాజిక సమస్యలు, నిత్యం చూసే సంఘటనలు, వ్యక్తులు స్పందించి, వాటి పరిష్కారాలను రచనల ద్వారా చూపించినట్టు తెలిపారు.


" నాదీ మట్టి పోరాటమే " :

ఈ సంకలనాన్ని

నవయుగ భారతి (హైదరాబాద్), సంపాదకులు డాక్టర్ వడ్డి విజయ సారధి ఆవిష్కరించగా, విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ మారడాన సుబ్బారావు సమీక్ష జరిపారు. అత్యంత అద్భుతంగా సాగే

ఈ రచనా శైలి లో ఎన్నో ఎన్నెన్నో ప్రజా సమస్యలకు అక్షర రూపం కల్పించారన్నారు. వాటిలో ప్రధానాంశాలు :
గురజాడ ఏదీ నీ అడుగుజాడ ? - ఈ అన్న దేశ వెన్నుకొక విరుస్తున్నారు.

దేశం గురించి రచన లో భాగంగా . . . కలలో భారతం. . . .: బాధలు లేవు, లంచాలు లేవు, అడ్డు గోడలు లేవు అనే రచన, .. బ్రిటిష్ ను తరిమినా తీవ్రవాదం తరలలేదు., రాజకీయ స్వాతంత్రం వచ్చింది

కానీ స్వేచ్ఛ స్వాతంత్రం కాదు, మహాకవీ మామ్మవహించవయ్యా, తీవ్రవాద ఉద్యమ వ్యతిరేకంగా చేసిన రచన అందరినీ ఆకట్టుకుంది.

ఈ సంకలనానికి ముందుమాట చేసిన ప్రముఖ

రచయిత, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు లిఖించిన ప్రతీ అక్షరం అక్షర సత్యంగా దర్శనమిస్తోంది. మానసిక విశ్లేషణకు తొలి తాంబూలం ఇచ్చేవారు విజయ్ గోపాల్ అని

అన్నారంటే ఈయన రచనా శైలి తెలుస్తోంది.

కార్యక్రమం లో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని విజయ గోపాల్ రచన సంకలనాలు పరిశీలించి, అభినందించారు.

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns

media  #vizag  #visakhapatnam  #public library  #dr vijay gopal  #book release  #sahiti parishat

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam