DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాంధీ గిరీ కి అసాంఘిక శక్తులే బ్రాండ్ అంబాసిడర్లా ?

అబద్దాలు, లంచాలు, మద్యం, హింస  à°‡à°¦à±‡à°¨à°¾ గాంధీ à°—à°¿à°°à°¿ 

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2018 (Satya Ganesh ): ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్ర భారత దేశం లో గాంధీ à°—à°¿à°°à°¿ à°•à°¿ గాంధీ à°—à°¿à°°à±€ à°•à°¿

 à°…సాంఘిక శక్తులే బ్రాండ్ అంబాసిడర్లు à°—à°¾ తయారయ్యారు అన్నది వాస్తవం. అహింస , శాంతి, అనే గాంధీ à°—à°¿à°°à°¿ à°•à°¿ ప్రస్తుతం అసాంఘిక శక్తులే ప్రతినిధులుగా నిలబడుతున్నారు.

సమాజంలో ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్నారు అంటూ కొందరిపై గూండా యాక్ట్ ప్రకారం రౌడీషీట్ తెరిచినవారు అదే రాజకీయ పార్టీ తరపున చట్ట సభలకు ఎన్నికవుతూ, ప్రజలకు

ఏకు కు మేకై కూర్చున్నారు. చట్టసభల్లో ఉండే గాంధీ విగ్రహం ఎదుటే గౌరవ ప్రదంగా ఉండవలసిన సభ్యులు బాహా బాహీ, ముష్టి యుద్దాలు, అసభ్య పదజాలం తో నానా హంగామా చెయ్యడం

సభ్య సమాజం లో ఇదే లేటెస్ట్ ట్రెండే గా మార్చేశారు. వీరికి రాజకీయ పార్టీలే ప్రధాన అండగా నిలబడి, ఏరి కోరి మరీ వీరిని చట్టసభలకు ఎంపికచేస్తున్నాయి. వారిలో అన్ని

పార్టీల వారూ అగ్రతాంబూలం ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో నోట్లు పంచుతూ, మందు సీసాలు సరఫరా చెయ్యడం మాత్రమే తమ హక్కు అని భావించే వారు కొందరైతే, ఏకంగా నోటికి

వఛ్చిన హామీలు గుప్పిస్తూ, అబద్దాలను చెప్పడం తమ జన్మ హక్కుగా భావిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థుల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వరకూ అందరూ రన్నింగ్ రేస్ లోనే

ఉన్నారు అన్నది అక్షర సత్యం. 

అయితే వీరంతా గాంధీ ని కేవలం ఒక బొమ్మగానే భావిస్తూ, అతని కళ్ళకు గంటలు కట్టి మరీ మానిఫెస్టోల పేరిట గుట్టగుట్టలు గా అసత్యాలు

ప్రకటన, అహింసాయుతం అంటూనే హింసకు ప్రేరేపించడం, దౌర్జన్యాలు చెయ్యడం, మద్యం ఏరులుగా పారించడం, ఇదే అలవాటు గా మార్చి, వీళ్ళు చేసే ప్రతీ చెత్తపనికీ ముందు గాంధీ

విగ్రహానికి నివాళి అంటూ పెద్ద బిల్డప్ ఇవ్వడమే భావితరాలకు వీరిచే గాంధీ మార్గం à°—à°¾ తయారు చేసేసారు. 

మద్యం మాఫియాలే ప్రభుత్వాలను శాసిస్తున్నాయి. ఊరికో

గాంధీ విగ్రహం ఉందొ లేదో తెలియదు కానీ, వీధికో మందు షాపు లు మాత్రం వెలుస్తున్నాయి, అది కూడా ప్రభుత్వాలు అధికారికంగా అనుమతిస్తూ, నడిపిస్తున్న దుకాణాలు, ఇక

అనుమతి లేని బెల్ట్ షాపులు ఇంటికోటి వెలుస్తున్నాయి. à°ˆ మద్యం దుకాణాలను భారీ పోలీసు బందోబస్తుల మధ్య  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°®à±‡ ఉన్నతాధికారులచేత వేలంపాటలు వేయించి మరీ ఏ

దుకాణం ఎవరికీ ఇవ్వాలో నిర్ణయిస్తోంది. ఈ రాష్ట్రం లో ఒక్క సారి మాత్రం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసింది, ఆ తర్వాత పాలకులు

మద్యానికి పాదాక్రాంతులయ్యారు. 

అసెంబ్లీ ముందు గాంధీ, పార్లమెంట్ ముందు గాంధీ . . . . 

ప్రపంచానికే శాంతి కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన గాంధీ ని వీళ్ళు

గేటు బయటే పెట్టి, చట్ట సభల్లో వీళ్ళు చేసేంది ఏంటి? తాము చేసేది ఏంటి అనే విషయం ఒక్కసారైనా ఆలోచించారా?  à°—ూండాలు, అత్యాచార యోధులు, అసత్య హరిశ్చంద్రులు,

మందుబాబులు, ఎందరో చట్టసభల్లో చేసే పనులు ఏంటో దేశమంతా ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షంగానే చూస్తున్నారు. మందు తాగవద్దు అన్న గాంధీ మాటని చాపచుట్టేసి, మద్యం

వ్యాపారులే ప్రజా ప్రతినిధులుగా మారిపోతున్నారు. వారు వీరు లేదు దాదాపుగా అందరూ అలాగే తయారయ్యారు. 

అసత్యం వద్దు అన్న గాంధీ మాటకి ఏనాడో వీళ్ళు తూట్లు

పొడిచేసారు. మేనిఫెస్టో లో చెప్పే కబుర్లు ఏ ఒక్కటీ కూడా అమలు చెయ్యడం లేదు, పైగా ఈ కబుర్లు చెప్పే వారే, అదే గాంధీ ఫోటో ( చట్ట సభల్లో) ఎదురుగా ప్రమాణ స్వీకారం కూడా

చేస్తున్నారు. మద్యం కు బానిస కావద్దు అన్న మాటను పాతి పెడుతూ మద్యం వ్యాపారులే ఎమ్మెల్యే లు గానూ, ఎంపీలు గానూ ఎన్నికైపోతున్నారు, అది కూడా అదే మద్యం సరఫరా చేసి,

డబ్బులు పంచి, నోటుకు ఓట్లు కొనుక్కుని మరీ. 
ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులైతే గాంధీ కి నివాళి అర్పించే అర్హత వీళ్ళకెక్కడిది ?

గాంధీ కే టోపీ పెట్టె

రకాలు ఇవి...

జనవరి 26 , ఆగస్టు 15 , అక్టోబర్ 2 , వస్తే చాలు ఈ దేశం తలపై తెల్ల టోపీ లు పెట్టుకునే బపూన్లు ఎక్కువైపోతున్నారు. అసలు గాంధీ పేరుకూడా తలవడానికి అర్హత లేని

వాళ్ళు, తలపై గాంధీ టోపీ పెట్టేసుకుని, గాంధీ కి తామే వారసులమని చెప్పేసుకునే స్వయం ప్రకటిత గాంధీలు ఇప్పుడు వీధికొకడు తయారయ్యాడు. అసలు గాంధీ ఆలోచనలు, ఆశయాలు

ఏంటి అనేది ఒక్కడికి కూడా తెలియవు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు. చేస్తే వీళ్ళకి ఉన్న మంత్రి పదవులు, చైర్మన్ గిరీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులు

తుడిచిపెట్టుకు పోతాయని చచ్చేంత భయం మరి. ప్రస్తుతం అధికారం లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదో విధంగా గాంధీ గిరికి ఎప్పుడో ఒకప్పుడు తూట్లు పొడిచినవారే. వీళ్లంతా గాంధీ

à°•à°¿ వారసులు à°—à°¾ చెలామణి అవుతుంటే. . . . . నిజమైన గాంధీ వారసులు ఎక్కడున్నారో కూడా ప్రపంచానికి తెలియదు. 

మీరేవిధంగా గాంధీ వారసులు అవుతారు? రాహుల్ కు శ్రీ కృష్ణ

కులకర్ణి లేఖ 

ప్రస్తుతం గాంధీ వారసులు గా చెప్పుకుంటున్న ఓ కుటుంబానికి గాంధీకి ఎటువంటి సంబంధం ( అధికారికంగా) లేదు అన్నది గాంధీ కి నిజమైన వారసుల మాట.

గాంధీ ముని మనుమడు (మూడవ కుమారుడు రాందాస్ గాంధీ  à°•à±‚తురి కొడుకు ) శ్రీకృష్ణ కులకర్ణి à°ˆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు à°’à°• బహిరంగ లేఖ కూడా వ్రాయడం

జరిగింది.. గాంధీ వారసులమంటూ గత ఏడూ దశాబ్దాలుగా ఈ దేశ ప్రజలను తప్పుదారి పట్టించింది చాలు అంటూ ఘాటుగానే హెచ్చరించారు. ఏ విధంగానూ గాంధీ కుటుంబంతో సంబంధం లేని

మీరు గాంధీ పేరు వాడుకుంటూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు. ఇది కేవలం అధికారం కోసం ఏడూ దశాబ్దాల పాటు గాంధీ పేరుని విస్తృతంగా వాడుకున్నారు అని ఒక టీవీ

à°•à°¿ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఘాటుగానే వ్యాఖ్యానించారు. గాంధీ పేరుని తప్పుదారి పట్టించడం ఇష్టంలేక,  à°—ాంధీ ఆశయాలకు లోబడి, గాంధీ కుటుంబ సభ్యులు ప్రత్యక్ష

రాజకీయాల్లోకి రాలేదన్నారు. గాంధీ సైతం ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వచించలేదు అని అయన గుర్తు చేశారు.

 

 

#dns  #dnslive 

#dnsnews  #dnsmedia  #dns live  #dns news  #dns media  #vizag  #visakhapatnam  #gandhi  #gandhi jayanti  #gandhi giri  #politicial parties

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam