DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు తీర్పు అండగా అయ్యప్ప మాలతో  అనాచారం. 

కోర్టు తీర్పులు ప్రక్కదారి పట్టాయి, భాద్యులు ఎవరు ?

హిందూ ధర్మాన్ని బ్రష్టుపట్టించేందుకేనా ఈ కోర్టులా ?

కోర్టు తీర్పు కి వ్యతిరేకంగా కేరళ మహిళల

భారీ ర్యాలీ 

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2018 (DNS Online ):  à°‡à°Ÿà±€à°µà°² భారత దేశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల ఫలితంగా హిందూ ధర్మం నడిరోడ్డెక్కింది, తైతక్కలాడుతోంది.

కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఎవడు పడితే వాడు à°ˆ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.  .  à°¶à°¬à°°à°¿à°®à°²

ఆలయంలోకి అందరు మహిళలకూ ప్రవేశం కల్పించాలి అంటూ కోర్టు ఉచిత సలహా సమాజం లోకి వదిలింది . అయితే గతం లో కోర్టులు అంటే ప్రతీ భారతీయునికి ఎంతో గౌరవం ఉండేది. అయితే

కొన్ని విభిన్న భావాలు కల్గిన కొందరు వ్యక్తులు జడ్జీలుగా రావడంతో తీర్పులు సైతం విభిన్నంగానే ఉంటున్నాయి.  à°µà°¾à°³à±à°³à± కొన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని

తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని వేరే కోణం లో చూసే హిందూ వ్యతిరేక శక్తులు వీటిని పూర్తిగా తప్పుదారి పట్టించేస్తున్నాయి. ఉదాహరణకు శబరిమల ఆలయంలోకి

మహిళలకు ప్రవేశం అంటూ కోర్టు ఇచ్చిన తీర్పు ను ప్రక్కదారి పట్టిస్తూ,  à°’à°• యువతి అయ్యప్ప మాల ధరించి, నుదుటున విభూతి ధరించి, నల్లని వస్త్రాలు వేసుకుని, పంచె ను 90
/>  à°¶à°¾à°¤à°‚ పైకి ఎత్తి పెట్టి కూర్చుని జనాన్ని రెచ్చగొట్టే విధంగా ఫోటోలు తీసి సోషల్ మీడియా పెట్టి మరీ వెటకారం చేసింది. దీనికి స్పందనగా కొందరు వ్యక్తులు కొన్ని

విభిన్న సందేశాలు కూడా కామెంట్ల రూపం లో పెట్టడం తో అయ్యప్ప భక్తులను భయబ్రాంతులని చేస్తోంది. ఇది కోర్టు తీర్పు వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే చోటు చేసుకున్న

ఘటన, ఇక రానున్న కాలం లో ఇంకెన్ని బూతు సినిమాలు చూపిస్తారో తెలియకుండా పోయింది. వాస్తవానికి ఇలా హిందూ ధర్మాన్ని వెటకారం చేసే వారెవరికీ హిందూ ధర్మం పట్ల గౌరవం

గానీ, భారత దేశం పట్ల భక్తి గానే ఉండవు, వీరు కేవలం సమాజాన్ని బ్రష్టు పట్టించడానికే ఇలాంటి వెటకారాలు చేస్తుంటారు. పైగా ఇలాంటి వాటిని  à°ªà±à°°à°§à°¾à°¨ కారణం à°—à°¾ సుప్రీం

కోర్టు ఇచ్చిన తీర్పు నే సాకుగా చూపిస్తున్నారు. అయితే వీటిని అరికట్టే భాద్యతను à°ˆ తీర్పులు ఇచ్చిన  à°¨à±à°¯à°¾à°¯ మూర్తులు తీసుకుంటారో లేదో తెలియాలి. 


హిందూ

సంప్రదాయాల్లో కోర్టు జోక్యం అనవసరం : మహిళా భక్తులు 

కేరళ రాష్ట్రం పండనంతిట్ట పట్టణంలో శబరిమలై గుడి లోకి మహిళలు ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన

తీర్పుని నిరసిస్తూ.. మంగళవారం 4000 మందితో  à°­à°¾à°°à±€ ర్యాలీ నిర్వహించారు.  à°®à±‡à°®à± 50 ఏళ్ళు వరకు ఎదురు చూస్తాము. కానీ ఆచారం పాటిస్తాం అని చాటి చెప్పారు. శబరిమలై దేవాలయం ఉన్న

పవిత్రతను, వివాదం చేయొద్దు అంటూ మహిళలు రోడ్లపైకి వచ్చి స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.. అదే విధంగా వందల ఏళ్ళ నాటి నుంచి

వస్తున్నా సంప్రదాయాలను మార్చడానికి కోర్టుల ప్రవేశాన్ని వీళ్ళు తప్పు పట్టారు. హిందూ సంప్రదాయాల్లో కోర్టుల జోక్యం అనవసరమని మండిపడ్డారు. దీన్ని

వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వెయ్యాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణం సుప్రీం కోర్టు ఈ తీర్పు ను విరమించుకుని కోట్లాది మంది హిందువుల మనోభావాలు

కాపాడాలన్నారు. హైందవేతరులు వేసిన పిటిషన్ పై తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వాళ్ళ హిందూ వ్యతిరేక శక్తులు పెట్రేగి పోతున్నాయన్నారు.

 

#dns  #dnslive  #dns news  #dnsmedia  #dns

media  #vizag  #visakhapatnam  #ayyappa mala  #kerala  #women protest  #supreme court verdict

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam