DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్థి దశ లోనే మానసిక చాంచల్యాన్ని గ్రహించాలి : మానసిక వైద్యులు 

7 à°¨ బీచ్ లో మానసిక హెల్త్ వాక్ , 10 à°¨ ప్రపంచ మెంటల్ హెల్త్ డే 

 à°µà°¿à°¶à°¾à°–పట్నం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): మారుతున్న సమాజం ప్రభావం యువత మానసిక స్థితిగతులపై పడుతోందని, దీనిపై

అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు విశాఖ మానసిక చికిత్సాలయం సూపరెంటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. బుధవారం ఆసుపత్రి ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆమె మాట్లాడుతూ à°ˆ నెల 10 à°µ తేదీన ప్రపంచ మెంటల్ హెల్త్ డే à°—à°¾ పాటించడం జరుగుతుందని, దానిలో భాగంగా 4  à°¨à±à°‚à°šà°¿ 10 వరకూ వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు

నిర్వహిస్తున్నామన్నారు. 4 à°µ తేదీన విశాఖపట్నం లోని పేదవాల్తేరు లో à°—à°² మానసిక వైద్య శాల లో మానసిక చాంచల్యం,  à°µà±ˆà°¦à±à°¯ విధానం పై సదస్సుతో à°ˆ కార్యక్రమం

ప్రారంభమవుతుందన్నారు. 5 à°µ తేదీన ఆంధ్రా మెడికల్ కళాశాలలో వైద్య అధ్యాపకులు, ఎంబిబిఎస్  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±, పీజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్విస్తున్నట్టు

తెలిపారు. 6 వ తేదీన న్యాయ, పోలీసు సిబ్బంది, స్వచ్చంద సేవ సంస్థలతో సమావేశం, మద్యం సేవనం, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారికి తగిన వైద్య శిబిరం నిర్వహించడం

జరుగుతుందన్నారు. 7 వ తేదీన విశాఖ సాగర తీరం మెంటల్ హెల్త్ వాక్ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాలలు, విద్యా సంస్థలు, వైద్య శాలలు, నర్సింగ్

విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈ నెల 8 వ తేదీన ఒత్తిడి, మానసిక సమస్యల పై పాఠశాలలు, విద్యాలయాలు,

కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నెల 9 వ తేదీన డిగ్రీ విద్యార్థులకు (1 నుంచి 6 సెమిస్టర్లకు ) క్విజ్ పోటీలు, డిగ్రీ

విద్యార్థులకు (7 నుంచి 9 సెమిస్టర్లకు ) వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 10 వ తేదీన ప్రపంచం మెంటల్ హెల్త్ డే ను పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన

నినాదం పై  à°ªà±à°°à°œà°²à°¤à±‹ చర్చ గోష్ఠి జరుగుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ తమ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యం

అందించి, మానసిక స్థితి సామాన్యంగా తయారు చెయ్యాలి అనే సంకల్పం తోనే ప్రతి వైద్యులందరూ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అయితే తమ ఆసుపత్రిలో చేర్పించే వారికి

కుటుంబ సభ్యులు నుంచి, మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తప్పని సరి అన్నారు. అయితే ఇటీవల కాలం లో కొందరు పోలీసు సిబ్బంది కొందరు వ్యక్తులను తీసుకువచ్చి వైద్యం

చెయ్యమని సూచించడం జరిగిందని, అయితే తాము మేజిస్ట్రేట్ నుంచి ఆమోద లేఖ లేనిదే వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదు అని చెప్పడం తో తమపై దుర్భాషలాడడం

జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ సిబ్బంది నిబంధనలకు విరుద్దంగా వెళ్లడం లేదన్నారు. 


విద్యార్థి దశ నుంచే గుర్తించాలి : డాక్టర్ నర్సింహా

రెడ్డి 

మానసిక చాంచల్యం బాల బాలికలకు 14  à°¸à°‚వత్సరాల వయసులోపు ప్రారంభమవుతుందని, దాన్ని à°† స్థాయిలో గుర్తించలేక పొతే à°ˆ సమస్య తీవ్రతరమై à°† వ్యక్తి మానసిక

పరిస్థితి విషమిస్తోందని, ఆసుపత్రి పూర్వ సూపరెంటెండెంట్ డాక్టర్ నర్సింహారెడ్డి తెలియచేసారు. అయితే ఇటీవల కాలం లో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న యువత, పోటీ

ప్రపంచంతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు తగిన సూచనలు చేసి, లక్ష్య సాధనను చేరుకునేలా చెయ్యాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలోనూ అధ్యాపకులు, విద్యార్థులతో

మమేకమై, వారి లో కలిగే మానసిక మార్పులను గమనించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరిపై ఒత్తిడి తీసుకు రాకూడదన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖ

సైకియాట్రీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రామానంద సంపతి, డాక్టర్ కెవి రామిరెడ్డి, డాక్టర్ విజయ లక్ష్మి, డాక్టర్ వి పద్మ, విశాఖ సైకియాట్రీ సొసైటీ  à°¡à°¾à°•à±à°Ÿà°°à± బీజేపీ

మల్లికా, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #mental hospital  #world mental health day  #mental health walk 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam