DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే : కన్నా

చంద్రబాబు లొసుగులు బయటపెట్టిన ఐవైఆర్. 

విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) : ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధిలోకి తీసుకువెళ్లవలసిన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ à°—à°¾ తయారయ్యారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్ర ప్రదేశ్  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

మండిపడ్డారు. గురువారం  à°¬à±€à°œà±‡à°ªà±€ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశం గుంటూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. à°ˆ సందర్బంగా అయన విభజన తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లో

ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పడి వరకూ జరిగిన కుంభకోణాలను కూలంకషంగా వివరించారు. అమరావతి పేరుతొ చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అడుక్కోబెడుతున్నారన్నారు.

కేంద్రం నుంచి చెయ్యవలసిన సహకారం ఇతోధికంగానే వస్తోందని, ఇంతవరకూ ఇచ్చిన ఆర్ధిక సహాయానికి తగిన లెక్కలు చూపించమని అడిగితె అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే

భయంతో బీజేప తోనే తెగతెంపులు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అన్నారు. చట్టం లో ఎక్కడ స్పష్టత కల్పించలేదని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వమని లేదని, కేవలం

సాధ్యాసాధ్యాలు పరిశీలించామని ఉందన్నారు. అదే విధంగా దుగ్గరాజపట్నం లో పోర్ట్ ఇవ్వమని లేదని, అవకాశం పరిశీలించామని లేదన్నారు. విభజన చట్టం చేసిన కాంగ్రెస్

పార్టీ అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులను ఏర్పాటు చెయ్యమని కచ్చితంగా రాసి ఉంటె ఇప్పుడు బీజేపీ కి

మరో మార్గం లేకుండా ఇవన్నీ ఏర్పాటు చెయ్యవలసి ఉండేదన్నారు. అయితే. ఎటువంటి అవకాశం బీజేపీ కి లేకుండా కాంగ్రెస్ పూర్తి కుతంత్రం చేసిందన్నారు. తక్షణ పరిష్కారం

కోసం పోలవరం ప్రాజక్ట్ ను నిర్మించాలని ఏడు ముంపు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుతూ బీజేపీ కేంద్రం లో అధికారం చేపట్టిన మొదటిలోనే ఆర్డినెన్స్

తెచ్చిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పై బీజేపీ కి చిత్తశుద్ధి ఉందని, అయితే ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క అడుగుతుంటే చంద్రబాబు కు ముచ్చెమటలు

పడుతున్నాయన్నారు. అసలు విషయమే తెలియని కొందరు మంత్రులు నోటికివచ్చిన వ్యాఖ్యలు చేసేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం చేస్తున్న అరాచక అవినీతి పాలనను

మీడియా ద్వారా ఏ విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలో అధికార ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఐ వైఆర్ కృష్ణా రావు

రాష్ట్ర విభజన చట్టంలోని అనేక అంశాలను, ప్రత్యేక హోదా పై వాస్తవాలు - అసత్యాలు, తదితర అంశాలను కూలంకషంగా వివరించారు. పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా రాజధాని కోసం

జరిపిన భూ సేకరణ విధానం, రైతులను ఏవిధంగా మభ్యపెట్టిందీ, మాస్టర్ ప్లాన్ పేరిట సింగపూర్, జపాన్, లాంటి నగరాల్లో ఏవిధంగా గడిపింది వివరించారు. 

ఈ సమావేశంలో

రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంబోట్ల, అధికార ప్రతినిధుల ఇంచార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, ప్రధాన కార్యదర్శులు సురేష్ రెడ్డి,

సత్యమూర్తి, రాష్ట్ర పదాధికారులు, పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #central government   #union government  #andhra pradesh  #chandrababu naidu  #ap

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam