DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రస్తుత తరానికి సమాధానం చెప్పే వేద వాఙ్మయమే  ప్రతీచీ - నైమిశం. 

విశాఖపట్నం, అక్టోబర్ 8, 2018 (DNS Online) : వేద భూమి భారతావని లో ఉద్భవించిన వేద వాఙ్మయాన్ని పాశ్చాత్య దేశాలకు మరింత విశ్లేషాత్మకంగా అందించాలి అనే సంకల్పంతో ప్రతీచీ -

నైమిశం రచించినట్టు ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ శొంఠి శారదా పూర్ణ తెలియచేసారు. మంగళవారం నగరం లోని ద్వారకానగర్ లో గల పౌరగ్రంధాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం ఆమె మాట్లాడుతూ విశాఖ నగరం లో విద్యాభ్యాసం తదుపరి గత 45 ఏళ్లుగా అమెరికాలోని చికాగో నగరం లో నివాసం ఉంటూ ఉపాసన, కాలమానం, శాస్త్ర నిర్వచనం, సంఘర్షణ, అక్షరం,

స్వరం, వాక్కు, శక్తి, భావం, ఊహ వంటి అనేక అంశాల పై సాహిత్యపరంగా ఎన్నో పరిశోధనలు చెయ్యడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే భారతీయ వేద విజ్ఞానాన్ని పాశ్చాత్యవాసులకు

మరింత కూలంకషంగా అందించాలనే సంకల్పం తో వేద వాఙ్మయం పై అధ్యయనం చేసి సామాన్యులకు సైతం తెలుసుకునే విధంగా, అర్ధమయ్యే రీతిలో ప్రతీచీ నైమిశం పేరిట ఒక కోశాన్ని

రచించినట్టు తెలిపారు. మానవాళికి ఉపయుక్తమయ్యే అంశాలను, ప్రతీచి, వైయాసి అనే పాత్రల మధ్య జరిగే సంభాషణలకు అక్షర రూపమే à°ˆ గ్రంథమని తెలిపారు. 

ఈ గ్రంధాన్ని ఈ

నెల 12 వ తేదీన విశాఖనగరం లోని ద్వారకానగర్ పౌర గ్రంధాలయం l సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షులు సి ఎస్ ఎం రాజు,

విశిష్ట అతిధిగా నాగార్జున విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ వి. బాలమోహన్ దాస్ లు హాజరవుతారని, గ్రంథావిష్కరణ బ్రహ్మశ్రీ కాశీభట్ల సత్యనారాయణ చేయడం

జరుగుతుందన్నారు. గ్రంథ సమీక్ష డాక్టర్ పేరి రవికుమార్ చేయనున్నట్టు వివరించారు. 

విశాఖ సాహితీ, విశాఖపట్నం, అధ్యక్షులు డాక్టర్ కోలవెన్ను మలయవాసిని

మాట్లాడుతూ à°ˆ బృహత్తర గ్రంథావిష్కరణ కార్యక్రమం విశాఖ సాహితీ,  à°¶à±à°°à±€ అన్నమాచార్యలు ప్రోజక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థల సంయుక్త అధ్యర్యవం లో జరుగుతుందన్నారు.

గ్రంథ కర్త శొంఠి శారదా పూర్ణ, ప్రముఖ సంగీత అభిమాని డాక్టర్ సుసర్ల గోపాల శాస్త్రి కుమార్తె గానూ, సాహితీ అధ్యయన కర్తగా, వేద వాఙ్మయ రచయిత గా ఎంతో ప్రసిద్ధి

కెక్కారని, స్వదేశం పై ఆమెకు ఉన్న అభిమానం కారణంగా విశాఖపట్నం లోనే తన గ్రంధాన్ని ఆవిష్కరించాలని సంకల్పనతో అమెరికా నుంచి విశాఖ నగరం వచ్చారన్నారు. ఇంతవరకూ 14

గ్రంధాలను à°°à°šà°¿à°‚à°šà°¡à°‚ జరిగిందన్నారు. 
ఈ విలేకరుల సమావేశం విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షురాలు కందాళ కనకమహాలక్ష్మి, కార్యదర్శి గండికోట విశ్వనాధం తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dns news  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #USA  #chicago  #Visakha sahiti  #Sri Annamacharya project of North America  #Sonty Saradapurna  #Pratichi Naimisham

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam