DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ తపాలా వారోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : కె ఎస్ వెంకటేశ్వర రావు

నేడు పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు మేళా

విశాఖపట్నం, అక్టోబర్ 8, 2018 (డిఎన్ఎస్ DNS Online): జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు విస్తృత

ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖపట్నం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె ఎస్ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వ తేదీన పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు

ఖాతా మేళా నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తపాలా కార్యాలయాల్లో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 
ఈ నెల 9 న ప్రపంచ

తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని,9 నుంచి 15 వరకూ తపాలా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి రోజు 9 వ తేదీన వెలంపేట లోని ప్రధాన కార్యాలయం లో

స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడంతో ఆరంభమయ్యాయన్నారు. 11 న పోస్టల్ జీవన బీమా దినోత్సవం, దీనిలో భాగంగా ఖాతాదారులు జీవన బీమా పాలసీని చేయించుకోవాల్సిందిగా

సూచించారు. 12 న స్టాంప్ సేకరణ దినోత్సవం. వివిధ తరహాల స్టాంప్ లను సేకరించే ఔత్సాహికులతో సమావేశం, ప్రోత్సాహక సదస్సులు. 13 న వ్యాపార అభివృద్ధి కై స్పీడ్ పోస్ట్, బిల్

మెయిల్ సర్వీస్, నేషనల్ బిల్ మెయిల్ సర్వీస్, ఈ పోస్ట్, డైరెక్ట్ పోస్ట్, ఎక్స్ ప్రెస్ పార్సెల్, బిజినెస్ పార్సెల్, వరల్డ్ నెట్ ఎక్స్ ప్రెస్, లాజిస్టిక్స్ పోస్ట్

తదితర ప్రధాన సేవలపై ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 15 న మే యిల్స్ డే జరపడం జరుగుతుందని, ఈ రోజు పాఠశాలల విద్యార్థులకు తపాలా

కార్యాలయం లో జరిగే à°•à°¾à°°à±à°¯à°•à°²à°¾à°ªà°¾à°²à°¨à± తెలియచేయడం జరుగుతుంది. పోస్టల్ నెట్ వర్క్ విధానం లో సాధారణ లేఖలు బట్వాడా, రిజిస్టర్ లెటర్ ను పోస్ట్ చేసే విధానం, లేఖల బీమా,

పార్సెల్ విధానం, విపిపి సేవలు తదితర విషయాలను వివరించడం జరుగుతుందని తెలిపారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #postal week  #head post office  #venkateswara rao

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam