DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం రమేష్  ఆస్తులపై ఐటి దాడులు - కేంద్రం మెడలు వంచుతాం- లోకేష్

కాంట్రాక్టుల లెక్కల పైనే ఐటి శాఖ టార్గెట్ ? 

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలు ధర్నాలు, నిరసనలు. 

విశాఖపట్నం, అక్టోబర్ 12, 2018 (డిఎన్ఎస్ DNS Online):

తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. దీంతో

తెలుగుదేశం పార్టీ వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కు బినామీగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుండగా, 
సీఎం రమేష్ వ్యాపారాల పై ఐటి

దాడులు జరగడాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై నరేంద్ర మోడీ చేస్తున్న కక్ష పూర్తి చర్యగా అభివర్ణిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ఐటి దాడులు మొదలైన పది

నిమిషాల్లోనే ఐటి మంత్రి లోకేష్ తనకు బాగా అచ్చోచ్చిన ట్విట్టర్లో ట్వీట్ చేసేసారు. మాపై ఐటి దాడులు చెయ్యడం పూర్తిగా వ్యక్తిగత కక్ష కట్టడమేన్నాని, కడప స్టీల్

ప్లాంట్ కోసం సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేసి వంద రోజులు గడవక ముందే ఆయన్ని కట్టడి చేసేందుకు ఈ దాడులు చేసారని ట్వీట్ చేశారు. ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వక

పొతే కేంద్రం మెడలు వంచుతామని ట్వీటేశారు. ఇదంతా ఆంధ్రా పై మోడీ కక్ష పూరిత చర్య అంటూ  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ   స్థాయి లో పార్టీ నేతలు కుదేలైపోతున్నారు. ఢిల్లీ లో ఉన్న రమేష్

దీనిపై ఒక్క సారిగా భగ్గుమన్నారు.  

హైదరాబాద్ లోని ఆయన నివాసంలో 10 మంది అధికారుల బృందంతో తనిఖీలు జరుగుతున్నాయి.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±, à°•à°¡à°ª జిల్లాతో పాటు పలుచోట్ల

సీఎం.రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు, సీఎం.రమేష్ కంపెనీ రుత్విక్ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. చాలా  à°ªà°¨à±à°²à°¨à± భారీగా అంచనాలు

పెంచి, నామినేషన్ పద్ధతి లో కట్టబెట్టినట్టు ముఖ్యమంత్రి పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హవాతో తన బినామీ గా చెప్పబడుతున్న సీఎం రమేష్ కు

అప్పగించిన పలు ప్రొజెక్ట వివరాలను ప్రతిపక్ష పార్టీలు తెలియచేస్తున్నాయి. 
కుప్పం బ్రాంచ్ కెనాల్ 522 కోట్ల  à°ªà°¨à±à°²à± అప్పగింత, హంద్రీ నీవా ఫేస్ 2 లో 2,3,4,5,6 ప్యాకేజీలు

సుమారు వెయ్యి కోట్లు పనులు నామినేషన్ పై ఇచ్చేసిన ప్రభుత్వం, గాలేరు నగరి లో 27, 29, 26 ప్యాకేజీల్లో 350 కోట్లు పనులు, వెలిగొండ టన్నెల్ లో 270 కోట్లు పనులు, తెలుగు గంగ

లైనింగ్ పనుల్లో 289 కోట్ల కాంట్రాక్ట్ రిత్విక్ కు అప్పగింత, హంద్రీ నీవా విస్తరణ పనుల్లో  195 కోట్ల కాంట్రాక్ట్, హంద్రీ నీవా 34 à°µ ప్యాకేజి 234 కోట్ల పనులు, గుంత కల్లు

బ్రాంచ్ కెనాల్ పనులు 172 కోట్ల తో సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ సంస్థకు అప్పగింత, చరిత్ర లో ఎన్నడూ లేనాన్ని వర్కులు సీఎం రమేష్ సంస్థ కు అప్పగించిన సీఎం

చంద్రబాబు. ఒకే వ్యక్తి, లేదా సంస్థకు వేల కోట్ల కు సంబంధించిన ప్రాజక్టు అప్పగించడాన్ని టిడిపి నేతలు సైతం ఎన్నో మార్లు బహిరంగంగానే అభ్యంతరాలు చెప్పడం

జరిగింది. 

హైదరాబాద్ లోని పంజాగుట్ట లో గల అలహాబాదు బ్యాంకు లో రిత్విక్ సంస్థ కు చెందిన అకౌంట్ల ను పరిశీలిస్తున్నారు ఐటి అధికారులు. ఈ అకౌంట్ కి లాకర్లు

ఉన్నాయా లేదా, మరే ఇతర పేర్లతో బ్యాంకు ల్లో గోప్యంగా కీలక పత్రాలు దాచారు అనే అంశంపై  à°•à±‚లంకష  à°¸à±‹à°¦à°¾à°²à± చేపట్టినట్టు తెలుస్తోంది. 

ఆయన స్వగ్రామం

వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు

సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్‌

పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు

జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై

కూడా ఆదాయ పన్నుల శాఖ అధికారులు గతవారం దాడులు నిర్వహించారు. ‘బీఎంఆర్‌’ గ్రూప్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్న ఆయన ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు

పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. తాము చేసిన అక్రమాలు ఎక్కడ

బయటపడతాయోమోనని సైకిల్‌ పార్టీ నేతలు వణికిపోతున్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #telugu desam  #tdp  #cm ramesh #chandra babu  #lokesh  #it raids

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam