DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదం తెలియచేసేది శాస్త్ర విజ్ఞానమే : బ్రహ్మశ్రీ  కాశీభట్ల 

శారదా పూర్ణ విరచిత  à°ªà±à°°à°¤à±€à°šà±€ - నైమిశం గ్రంథ ఆవిష్కరణ.

విశాఖపట్నం, అక్టోబర్ 12, 2018 (డిఎన్ఎస్ DNS Online) : వేదం తెలియచేసేది కేవలం సంస్కృత శ్లోకాలు మాత్రమే కాదని, శాస్త్ర

విజ్ఞానం, అయితే ఈ వేదం భూమి లోని వారికంటే పాశ్చాత్యులే గ్రహించగలిగారని బ్రహ్మశ్రీ కాశీభట్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరం లోని ద్వారకానగర్ పౌర

గ్రంధాలయం లో జరిగిన శొంఠి శారదా పూర్ణ విరచిత  à°ªà±à°°à°¤à±€à°šà±€ - నైమిశం గ్రంథ ఆవిష్కరణ చేసి వేద వాగ్మయమ్ పై , పురాతన కాలంలో విద్యా విధానం పై అత్యద్భుత ప్రసంగం చేశారు.

వేదం లో తెలియచేయబడిన ఒక్కొక్క పదానికి శాస్త్ర సంబంధిత అంశాలే ఉన్నాయని, అయితే ప్రస్తుత తరానికి అర్ధం చేసుకునే తీరిక, ఓపిక లేక తమకి తోచిన అర్ధాలను మాత్రమే

గ్రహిస్తున్నారన్నారు. పాశ్చాత్య దేశాలకు చెందిన వారు ఈ అంశాల్లో అంతరార్ధాలను గ్రహించి ప్రపంచానికి తెలియచేస్తున్నారని, దాన్ని భారత దేశం లోని వారు, హమ్మయ్య

వాళ్ళు చెప్తే అది ఒప్పు అని అంగీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఏనాడో మన వేదం తెలియచేస్తే, వాటిని ప్రక్కన పెట్టి, వాడెవరో చెప్పారు కనుక, ఇది

కరెక్టు అని భావించే కాలం లో ఉన్నామన్నారు. ప్రతీ అంశంలోనూ ఒక బాహ్య పరమైన అర్ధం ఉంటుందని, మరొక అర్ధం అంతర్గతంగా ఉంటుందన్నారు. రెండు అర్ధాలనూ

తెలుసుకోవాల్సిన భాద్యత ఉంటుందని వివరించారు. విద్యాలయం అంటే à°’à°• అరణ్యమని, విద్య అనేది అరణ్యం లో పుట్టి నగరాలను అభివృద్ధి చేస్తుందన్నారు. 

వేద భూమి

భారతావని లో ఉద్భవించిన వేద వాఙ్మయాన్ని పాశ్చాత్య దేశాలకు మరింత విశ్లేషాత్మకంగా అందించాలి అనే సంకల్పంతో ప్రతీచీ - నైమిశం రచించినట్టు ప్రముఖ సాహితీ వేత్త

గ్రంథ కర్త డాక్టర్ శొంఠి శారదా పూర్ణ తెలియచేసారు. విశాఖ నగరం లో విద్యాభ్యాసం తదుపరి గత 45 ఏళ్లుగా అమెరికాలోని చికాగో నగరం లో నివాసం ఉంటూ ఉపాసన, కాలమానం,

శాస్త్ర నిర్వచనం, సంఘర్షణ, అక్షరం, స్వరం, వాక్కు, శక్తి, భావం, ఊహ వంటి అనేక అంశాల పై సాహిత్యపరంగా ఎన్నో పరిశోధనలు చెయ్యడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే భారతీయ వేద

విజ్ఞానాన్ని పాశ్చాత్యవాసులకు మరింత కూలంకషంగా అందించాలనే సంకల్పం తో వేద వాఙ్మయం పై అధ్యయనం చేసి సామాన్యులకు సైతం తెలుసుకునే విధంగా, అర్ధమయ్యే రీతిలో

ప్రతీచీ నైమిశం పేరిట ఒక కోశాన్ని రచించినట్టు తెలిపారు. మానవాళికి ఉపయుక్తమయ్యే అంశాలను, ప్రతీచి, వైయాసి అనే పాత్రల మధ్య జరిగే సంభాషణలకు అక్షర రూపమే ఈ

గ్రంథమని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షులు సి ఎస్ ఎం రాజు మాట్లాడుతూ గత నాలుగున్నర దశాబ్దాలుగా ఖండాంతరం లో జీవనం సాగిస్తున్నప్పడికీ, వేద

వాఙ్మయాన్ని అత్యద్భుతంగా అందించారన్నారు. విశిష్ట అతిధిగా నాగార్జున విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ వి. బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఒక రెండు తరాల

ప్రతినిధిగా ఈమె à°°à°šà°¨ చేసినప్పటికీ, రెండు యుగాలలో జరిగిన అంశాలను గ్రంథ రూపంలో ప్రకటించారన్నారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో ప్రతీచీ నైమిశం  à°—్రంథ సమీక్షను డాక్టర్ పేరి

రవికుమార్ చేశారు. 

విశాఖ సాహితీ, విశాఖపట్నం, అధ్యక్షులు డాక్టర్ కోలవెన్ను మలయవాసిని సభ కు అధ్యక్ష్య ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ బృహత్తర

గ్రంథావిష్కరణ కార్యక్రమం విశాఖ సాహితీ, శ్రీ అన్నమాచార్యలు ప్రోజక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థల సంయుక్త అధ్యర్యవం లో జరిగింది. à°ˆ సమావేశంలో  à°µà°¿à°¶à°¾à°– సాహితీ

సంస్థ ఉపాధ్యక్షురాలు కందాళ కనకమహాలక్ష్మి, కార్యదర్శి గండికోట విశ్వనాధం,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #book release  #sonty sarada purna  #public library


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam