DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా మహోపాధ్యాయ కే ఆచార్య రూపం న. చ. రఘునాథాచార్య

వైకుంఠ వాసుని సేవలో కవిశాబ్ధిక కేసరి

à°Žà°‚à°¤ ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండే మహనీయులు  . .

వరంగల్, అక్టోబర్ 13, 2018 (డిఎన్ఎస్ DNS Online) : ప్రముఖ విశిష్టాద్వైత సంప్రదాయ

పరులు, ముగ్గురు జీయర్లకు ఆచార్యులు, ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్ధిక కేసరి, మహా మహోపాధ్యాయ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు (94) పరమపద యాత్ర

వెళ్లడం ఆధ్యాత్మిక సమాజానికి తీరని లోటు. వరంగల్ లోనే ఉద్యోగం చేసి, దశాబ్దాలు గా అక్కడే వందలాది మంది శిష్య, ప్రశిష్యు లకు విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంధాలను

తెలియచేస్తూ ఆధ్యాత్మిక సమాజానికి ఏంటో సేవ చేశారు.  à°¶à±à°°à±€à°µà±ˆà°·à±à°£à°µ సంప్రదాయం లో ఈయన చేసిన రచనలు అందరిచే ఆమోద యోగ్యం కాబడి, ఆచరణీయంగా మారాయి. సంస్కృత, తమిళ, తెలుగు

భాషల్లో వీరు చేసిన రచనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంస్కరణల కృతజ్ఞతగా  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ లోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ వీరికి మహా మహోపాధ్యాయ సత్కారం అందించింది.

సుమారు 90 à°•à°¿ పైగా రచనలు చేశారు. చిన్న జీయర్ స్వామి సైతం ఎన్నో సంప్రదాయ విషయాలను వీరి వద్ద గ్రహించడం జరిగింది. 

సంప్రదాయం కు విరుద్ధంగా ఎన్నడూ గీత దాటని

మహనీయులు, విశిష్టాద్వైత సంప్రదాయం లో తెలియచేసిన అంశాలపై సంపూర్ణ పట్టు కల్గిన వీరు, వీటికి విరుద్దంగా వెళ్లేవారు ఎంతటి పెద్ద వారైనా సహించకుండా పూర్వ

తరానికి, నేటి తరానికి వారధిగా నిలిచారు. 

తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే :-  
తల్లిదండ్రుల వాత్సల్యం, గురువుల దయ, మిత్రుల సౌజన్యం.. ఇవన్నీ మనిషి జీవన

విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నా జీవితంలో ఇవి సమపాళ్లలో కుదిరాయి. అందుకే తొమ్మిదిపదుల వయసులోనూ ఇదిగో ఇలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇందులో ఏది కొరవడినా మానసిక

దౌర్బల్యం.. ఆపై శారీరక అనారోగ్యం కలుగుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ప్రధానమైనది. మనలో సత్వ గుణం ఉన్నంత కాలం ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి సత్వ

గుణాన్ని పెంచే ఆహారమే తీసుకున్నాను. కారం, చేదు, పులుపు ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. చక్కెర, ఉప్పు కూడా తక్కువ మోతాదులోనే తీసుకునేవాడిని. నా దేహవృద్ధికి

మంచి ఆహారం అందించిన మా అమ్మే ప్రధాన కారకురాలు. ఆప్యాయత రంగరించి ఆమె తినిపించిన గోరుముద్దలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి అని రఘనాధచార్య వ్రాసుకున్న స్వీయ

కృతి లో తెలిపారు. 

నియమాలతోనే..: 
ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ చాలా కచ్చితంగా ఉంటాను. ప్రస్తుతం ఉదయం లేవగానే గోరు వెచ్చని హార్లిక్స్‌, పాలు తాగుతాను.

అప్పుడప్పుడు కాఫీ. ఉదయం 10.30 గంటలకు కారంలేని పప్పుతో భోజనం. మజ్జిగలో పంచదార లేక అరటి పండు, ఒక స్వీటుతో భోజనం ముగిస్తాను. సాయంత్రం 5 గంటలకు కాఫీ తాగుతాను. రాత్రి 8

గంటలకు మితంగా భోజనం చేస్తాను. భోజన సమయంలో గోరువెచ్చని నీటిని తాగుతాను. అది వేసవికాలమైనా సరే. గంటల తరబడి ధార్మిక ప్రవచనాలు ఇచ్చే సమయాల్లో మిశ్రి కలిపిన

నీటితో పెదాలను అద్దుకుంటూ దాహం తీర్చుకుంటాను. 
 
అష్టాక్షరి అనుగ్రహం.. : 

మా నాన్నగారు శ్రీనివాసాతాతాచార్య స్వామి ఇచ్చిన అష్టాక్షరి మంత్రమే నాకు

జ్ఞానభిక్ష ప్రసాదించింది ఆయన నిత్యం తెలియచేసేవారు. అయన వద్ద సంస్కృత, వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు అధ్యయనం చెయ్యగా, న్యాయ వ్యాకరణం, శాసా్త్రభ్యాసం కోసం 14వ ఏట

హైదరాబాద్‌లోని సీతరాంబాగ్‌లో ఉన్న సంస్కృత పాఠశాలలో చేరారు. ఆరేళ్లపాటు సాహిత్య, వ్యాకరణ, తర్క మీమాంస శాస్త్రాలను రామానుజభాష్యంతో సహా అధ్యయనం చేశారు. 
 
/> ధార్మిక వ్యాపకం : 

1946 నుంచి వరంగల్‌ శివనగర్‌లో స్థిరనివాసం. ఇక్కడి వైదిక పాఠశాలలో, శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలోనూ సంస్కృత అధ్యాపకుడిగా

పనిచేసి పదవీ విరమణ చేశారు. ‘సతఃసాంప్రదాయ పరిరక్షణ సభ’, ‘సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్‌’ సంస్థలను స్థాపించి వీటి ద్వారా ‘శ్రీవిష్ణు సహస్రనామ భాష్యం’,

‘ముండకోపనిషత్‌’, ‘కఠోపనిషత్‌’, ‘వేద ప్రామాణ్యము’, ‘శ్రీ భాష్యమునకు తెలుగు వ్యాఖ్యానము’ వంటి 90à°•à°¿ పైగా గ్రంధాలను ప్రచురించారు. ‘శ్రీపాంచరాత్ర ఆగమ పాఠశాల’

ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. శాస్త్ర సంప్రదాయ, సాహిత్య సేవా రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు ప్రముఖులకు ప్రతి ఏడాది శ్రీరఘునాథదేశిక

విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
వారు మన వైష్ణవ సిద్ధాంత దిక్సూచి, అపర ఆచార్యులు మనందరికి మార్గదర్శకులు. వారు ఆచార్య తి‌రువడిని చేరారు అనేది

మనందరికి చాలా లోటు. వారి ఆశయం శ్రీవైష్ణవ సిద్ధాంత వ్యాప్తి. ఆదిశగా మనమందరం వారు అందించిన సంప్రదాయ గ్రంథ పఠనం చేద్దాం. అదే వారికి మనమిచ్చే కానుక.


/> ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. :  à°¤à±†à°²à°‚గాణ  à°¸à±€à°Žà°‚ కేసీఆర్ 

ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్ధిక కేసరి మహామహోపాధ్యాయ శ్రీ రఘునాథాచార్య స్వామి వారి

మరణం సంప్రదాయ గోష్టి కి తీరని లోటు అని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా, సంపరాయ పరంపరను

కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారు. ఆజన్మాంతం తన

ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి. వారి కుటుంబానికి, శిష్య, ప్రశిష్యులకు ప్రగాఢ సానుభూతి

తెలియచేస్తున్నట్టు తెలిపారు. 

 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #warangal  #telangana  #jeeyar  #aghanadhacharya

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam