DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిత్తశుద్ధితో వస్తున్నా. . .  చుక్కలు చూపిస్తా . : పార్టీలకు  పవన్ హెచ్చరిక 

వస్తాదులకు వణుకు పుట్టిస్తాం. : 

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : ప్రజా సేవ చేద్దామని చిత్తశుద్ధితో ప్రజా క్షేత్రం లోకి వస్తున్నానని, ఆషాఢభూతి

రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం లోని ప్రతిష్టాత్మకమైన గోదావరి బ్రిడ్జి పై నుంచి

ధవళేశ్వరం వరకు నిర్వహించిన భారీ   కవాతు నిర్వహించిన తదుపరి ధవళేశ్వరం కాటన్ మ్యూజియం వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ నిరుద్యోగ

యువతను తెలుగుదేశం, బీజేపీ పార్టీలు నమ్మించి మోసగించాయని, వారి à°•à°¿ à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు జనసేన ఉందన్నారు. 

కర్ర లేదు - బీర లేదు - జాబు లేదు . .

ముఖ్యమంత్రి

పాలన పై విరుచుకు పడిన పవన్, పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీల కర్ర లో " కర్ర " ఉండదని,  à°¨à±‡à°Ÿà°¿ బీరకాయ లో " నెయ్యి" ఉండదని, అలాగే  à°¬à°¾à°¬à± హయం లో " జాబు " లేదన్నారు.

దీంతో ఒక్కసారిగా సభ ప్రాంగణం చప్పట్లతో మారు మ్రోగింది. 

రాజకీయం ఎవరి సొత్తు కాదని, దొంగదారిలో మంత్రిపదవులు కొట్టేసే రకాలు జనసేన లో లేవన్నారు.

అనర్హులను అందలం ఎక్కించడం ఉండదని, ఆస్తులు పంచినట్టు ముఖ్యమంత్రి సీట్లు లోకేష్ ను పంచడం కుదరదన్నారు. కనీస అర్హత, అనుభవం లేని వ్యక్తిని అడ్డదారిలో చట్టసభకి

పంపి, ఏకంగా మంత్రిని చెయ్యబటీ ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. గత పాలన బట్టే చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో మద్దతు ప్రకటించామని,

అంతే తప్ప బాబు తర్వాత లోకేష్ కు ముఖ్యమంత్రి సీటు అప్పగించడానికి ఆ సీటు మీ సొంత జాగీరు కాదని, రాబోయే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుందామని ముఖ్యమంత్రి

చంద్రబాబు కు  à°¸à°µà°¾à°²à± విసిరారు. 

కనీసం పంచాయితీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని, అసలు పంచాయితీ ఎన్నికలు ఎలా జరుగుతాయో కూడా తెలియని  à°²à±‹à°•à±‡à°·à± ని పంచాయితీ రాజ్

శాఖ మంత్రిని చేశారు, అసలు పంచాయితీ రాజ్ గురించి అతనికేమి తెలుసనీ ఏకంగా మంత్రిని చేసేసారు. ఈ రాష్ట్ర వైఫల్యం లో ప్రధాన పాత్ర తండ్రీ

కొడుకులదేనన్నారు. 

జాబు కావాలంటే బాబు రావాలి అంటూ ప్రగల్బాలు పలికి, లక్షలాది మంది నిరుద్యోగులను మోసగించారని, ఆంధ్ర ప్రదేశ్ లో నిలువ నీడ లేకుండా

భూకబ్జాలకు పాల్పడ్డారని, వీటిలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులూ, వీరందరికీ అండగా మంత్రులు, ఈ రాష్ట్రాన్ని

దోచుకుతింటున్నారని మండిపడ్డారు. 

ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ముఖ్యమంత్రి కి ఉండి ఉంటే, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని,

అసంఘటిత కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. బాబు అధికారం లోకి వచ్చిన గత నాలుగున్నరేళ్ల కాలం లో వేలాది గా చిన్న తరహా పరిశ్రమలు

మూతపడ్డాయన్నారు. 

ఎన్నికల్లో సహాయం చేసిన పాపానికి ప్రతీకారంగా మేము చేయని తప్పుకు నెలలకు, నెలలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, అవమానాలకు గురిచేసి, మా

తల్లిని తిట్టించారని, మేము గాంధీయవాదులమని, అలాగని చూస్తూ ఊరుకోమన్నారు. తిట్టడం మాకూ చేతనవునని,  à°­à°°à°¿à°¸à±à°¤à°¾à°‚, సహిస్తాం, ఆఖరికి అందరి తోలు తీస్తామని

హెచ్చరించారు. 

అంతకు ముందు వేలాది గా తరలి వచ్చిన జన సైనికులతో కలిసి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోదావరి నది పై బ్రిడ్జి పై కవాతు నిర్వహించారు. పవన్ వెంట

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎంపీ ముత్త గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.    

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #janasena  #rajamundry  #rajamahendravaram  #dhavaleswaram  #kavatu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam