DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరీ మల నిబంధనలను పై తీర్పును విభేదిస్తున్న గరికపాటి వీడియో వైరల్ 

అసంబద్ధ తీర్పులతో సమాజం అస్తవ్యస్తం. : గరికపాటి 

విశాఖపట్నం, అక్టోబర్ 22 , 2018 (డిఎన్ఎస్): ఇటీవల ఈ దేశాన్ని కుదిపేసిన కొన్ని అసంబద్ధ తీర్పుల ను వ్యతిరేకిస్తూ

దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కోట్లాది మంది అత్యంత పవిత్రం గా భావించే శబరీ మల అయ్యప్ప దర్శనం విషయంలో కొన్ని వయసుల మహిళలకు

ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ లక్షలాదిగా భక్తులు రోడ్డలపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

దీనికి సంఘీభావంగా ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు, అవధానులు సైతం తమ నిరసనలను ప్రసంగాల ద్వారా తెలియచేస్తున్నారు. ప్రముఖ మహా సహస్రావధాని గరికపాటి

నర్సింహారావు ప్రసార మాధ్యమం సాక్షిగా తమ నిరసన గళం వినిపించారు. పదవి విరమణ చేసేముందు ఏదైనా సంచలన తీర్పు ఇచ్చేసి, చేతులు దులుపేసుకుని, ఒక వివాదాన్ని తమ ఖాతాలో

వేసుకునే క్రమం లోనే భారత సుప్రీం కోర్టులు న్యాయ మూర్తులు తీర్పులు ఇచ్చేశారన్నారు. దానిలో అత్యంత వివాదాస్పదమైన వాటిల్లో శబరీ మల ఆలయంలో అన్ని వయసుల మహిళలకూ

ప్రవేశం కల్పించడం ఒకటి కాగా, స్వలింగ సంపర్కం అంగీకారం ఇంకోటి కాగా, వివాహేతర సంబంధాలను ( మహిళా, పురుషుల అంగీకారంతో) పెట్టుకుంటే తప్పు కాదు అంటూ ఇచ్చిన

తీర్పులు భారతీయ సనాతన ధర్మాన్ని పూర్తిగా భ్రష్టు  à°ªà°Ÿà±à°Ÿà°¿à°‚చేవేనన్నారు. పైగా సనాతన హిందూ ధర్మం లో మహిళలకు అత్యున్నత స్థానం ఇవ్వడం జరిగిందని, కేవలం కొన్ని

వయసుల వారిని మాత్రమే శబరీ మలకు అనుమతించడం లేదన్నారు. అక్కడికి వచ్చేవారు పురుషులు 40 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించి, దీక్ష సాగిస్తారని, తద్వారా ఎటువంటి

ప్రలోభాలకు లొంగకుండా ఉండే విధంగా సాగుతుందన్నారు. 
పైగా ఇతర మతస్తులకు హిందూ ధర్మం పై ఇబ్బందులు, లోటుపాట్లు కనిపించాయట, దానికి కోర్టులో కేసు వేశారు ట. తనది

కానీ ధర్మంలో వేళ్ళు పెట్టె హక్కు వీళ్ళకి ఎవడు ఇచ్చాడు అని ప్రశ్నించారు. 
అదే విధంగా స్వలింగ సంపర్కం పై, వివాహేతర సంబంధాల ఒప్పు పై  à°¤à±€à°°à±à°ªà±à°²à± సైతం భారతీయ

వివాహ వ్యవస్థను సర్వ నాశనం చేసేందుకు ఇచ్చారన్నారని అభిప్రాయం పడ్డారు. ఈ తీర్పులపై తానూ విభేదిస్తున్నానని, దీనికి జైలు శిక్ష పడినా తానూ సంతోషంగా

స్వీకరిస్తామన్నారు. ఇలాంటి తీర్పులతో కలిగే అనాచారాన్ని చూసే కంటే, జైల్లో రామ కృష్ణ అంటూ సాంబారు అన్నం సంతోషంగా తింటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడికైనా ఈ

అసంబద్ధ తీర్పుల పై పున: సమీక్షను చెయ్యాల్సి యుందన్నారు. 


భారత పార్లమెంట్ పై దాడి చేసిన ఘటనలో ఎన్నాళ్ళు విచారణ సాగదీశారు ? గోకుల్ చాట్ బాంబు దాడి కేసులో

విచారాల 14 ఏళ్లకు పైగా సాగదీసారు. అలాంటిది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా కేవలం కేసు వేసిన కొన్ని రోజుల్లోనే అసంబద్ధ తీర్పులు

ఇచ్చేస్తారా అని మండిపడ్డారు. ఇది కచ్చితంగా హిందువుల భావాలు, విశ్వాసాలు దెబ్బతీసే ప్రయత్నంగానే కనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

హిందూ మనోభావాలపై

అన్యకులు కేసు ఎలా వేస్తారు. ? 
అసలు సుప్రీం కోర్టులో కేసు వేసింది ఎవరు?  à°¹à±ˆà°‚దవేతరులు, à°’à°• ముస్లిం అయ్యప్ప ఆలయం పై కేసు వేశారు. వాళ్లకి హిందూ ధర్మానికి,

 à°…య్యప్ప గుడికి సంబంధం ఏంటి? కనీసం వాళ్లకి అయ్యప్ప గురించి తెలుసా? విన్నారా?  à°¹à°¿à°‚దూ ఆలయ సంప్రదాయాల గురించి వీళ్ళకి తెలుసా? అదే ఇస్లాం ధర్మం పై హిందువులు

కేసులు వెయ్యచ్చా ? హిందువులు సంస్కార వంతులు, వారికి పరధర్మం పట్ల గౌరవం ఉంది, తెలియని ధర్మాల్లో  à°¹à°¿à°‚దువులు వేళ్ళు పెట్టి కెలకరు. అదే విధంగా అందరూ ఉండాలి అని

భావిస్తుంటారు. అయితే ఈ దేశం ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఇతరులు, అన్నివేళలా హిందూ సంప్రదాయాల పై విషాన్నే చిమ్ముతున్నారు. అయినప్పటికీ ఓర్పు

వహిస్తున్న హిందువులకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సంఘీభావం ప్రకటించవలసింది పోయి, ఇంకా రెచ్చెగొట్టే ప్రయత్నాలు, ప్రసంగాలు చేస్తున్నాయి. 

ఈ కేసులో

జరిగింది ...

ఎవత్తో పనీ పాటు లేనిది, అసలు హిందూ ధర్మానికి ఏమాత్రం సంబంధం లేనివాళ్లు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు, కేవలం హిందూ ధర్మాన్ని బద్నాం చేద్దాం అనే

ఏకైక దుర్భుద్ధి తో కోర్టు తీర్పు ను సాకుగా చూపిస్తూ. . . . . ఇలా అప్పయ్య ఆలయాన్ని చండాలం చెయ్యడానికి ఎగేసుకుని దూరిపోతుంటే . . . అయ్యప్ప భక్తులు ఎవరూ చూస్తూ ఊరుకోరు.

పైగా అక్కడ ఉద్యమం చేస్తున్నది మహిళలే.  (పైగా ఎవడో సుప్రీం లో కేసు వేసింది వీళ్ళ కోసమే.) వీళ్ళకే à°ˆ కేసు వెయ్యడం నచ్చలేదు. అసలు లబ్ధిదారులకే నచ్చని విషయాలపై

ఎవడో కేసు వెయ్యడం ఏంటి ? మరొకడు తీర్పు ఇవ్వడం ఏంటి?  à°…సలు వీళ్లెవరైనా వీళ్ళ ఇంటిపక్కనే ఉన్న హిందూ ఆలయానికి వెళ్లిన దాఖలాలు ఉన్నాయా? 

తీర్పు ను

వక్రీకరించి.  :
అయ్యప్ప మొహం పై చండాలం విసరడమే లక్ష్యంగా ? 

శబరీ మల ఆలయం లో మహిళలకు ప్రవేశం అన్న ఒక్క పదం వల్ల కొందరు ఉన్మాదులు చేసిన ప్రయత్నం సభ్య సమాజం

తలదించుకునేల ఉండాలి. జీవిత కాలం లో కనీసం ఏ గుడికీ వేళ్ళని కొందరు మహిళలు సైతం శబరీ మల అయ్యప్పను  à°šà±‚ద్దాం కోసం వెళ్లారు. వీళ్ళకి రక్షణ కల్పించేందుకు ఏకంగా

ఐజి స్థాయి పోలీసు అధికారి రంగంలోకి దిగారు. అయితే హిందూ ధర్మం పై విషం జిమ్మడానికె  à°…న్నట్టు à°ˆ మహిళలు ఇరుముడి పేరుతొ à°’à°• మూట తెచ్చి, దానిలో మహిళలు సైతం

మాట్లాడుకోడాని అభ్యంతర కరమైన నాప్కినలు పెట్టి, అయ్యప్ప గుడికి వచ్చారు. ( ఇది ఆ మహిళలు సోషల్ మీడియా లో చెప్పిన విషయమే ). పైగా వాళ్ళ దురహంకారం ఎంతవుందంటే. . .

గుడిలోకి వెళ్ళనిస్తే ఈ నాప్కిన్లను అయ్యప్ప మొహం మీదకి విసురుతారు ట. అదీ వీళ్ళ మంత్రాంగం. వీళ్ళ దుశ్చర్యలకు భక్తులు ఆదిలోనే అడ్డుకట్ట వేశారు. ఒక వేళా వీరు

చెప్పినదే జరిగి ఉంటే. . . .  à°ˆ చండాలానికి ఎవరు భాద్యత వహిస్తారు. తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులా  à°²à±‡à°• కేసు వేసిన అన్య మతస్తులా ? 
ప్రతి ఆలయానికి ఒక నియమం, ఆగమం

ఉంటుంది. దాన్ని ఛేదించేందుకు ఎవరికీ అర్హత లేదు. అది ఎంతటి వారైనా సరే. ఆలయంలో మూల మూర్తే ప్రధాన న్యాయ మూర్తి, అక్కడ సర్వాధికారం వారిదే. దీన్ని కాదనే హక్కు

ఎవరికీ ఉండదు. ఇది ఆలయ సంప్రదాయం. 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #garikapati  #narasimha rao  #shabarimala  #jonnavithula  #gokul chat  #parliament  #supreme court  #verdict

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam