DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్సార్ మానస పుత్రికే ట్రిపుల్ ఐటి: సీఎం జగన్ 

ప్రతి ఏటా జనవరి 1 ని ఉద్యోగ భర్తీ డే గా చేస్తాం :

రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 
మానస పుత్రికే ట్రిపుల్ ఐటి అని  à°°à°¾à°·à±à°Ÿà±à°°

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఎచ్చెర్ల మండలం యస్.యం.పురం వద్ద సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన

ట్రిపుల్ ఐటి అకడమిక్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి  à°µà±ˆ.ఎస్.రాజశేఖర రెడ్డి దూరదృష్టి, ఆలోచనలతో

యూనివర్సిటీలు ఆవిర్భవించాయని చెప్పారు. పేద, దళిత గ్రామీణ విద్యార్ధినీ విద్యార్ధులకు మంచి ఉన్నత విద్యను అందించడంతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలను

కల్పించడానికి ట్రిపుల్ ఐటిలకు రూపకల్పన చేయాలని ప్రొఫెసర్ కె.సి.రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రంలోని

ఇడుపులపాయ, ఆర్.కె.వెల్లి, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటి లను స్థాపించినట్లు తెలిపారు. అయితే గత ఐదేళ్లలో ట్రిపుల్ ఐ.టిలు నిర్లక్ష్యానికి

గురయ్యాయని, ట్రిపుల్ ఐ.టిల గురించి అక్కడ సమస్యల గురించి పూర్తి అవగాహనతో ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. శ్రీకాకుళం క్యాంపస్ ఏర్పాటుచేసి నాలుగేళ్లు

అయినప్పటికీ అరకొర వసతులతో నడుస్తున్నాయని చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి ఏర్పాటుచేసి నాలుగేళ్లు అయినందున నాలుగు వేల మంది విద్యార్ధులైన

చదువుకుంటున్నారని అనుకున్నామని, అయితే కేవలం 1500 మంది విద్యార్ధులు చదువుతున్నారని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రంలో కళాశాలలు ముందడుగు

వేయలేదని చెప్పారు. కళాశాలల అభివృద్ధికి సంబంధిన నిధులు దాదాపు రూ. 180 కోట్లు పక్కదారి పట్టాయన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పూర్తిగా పాడైపోయినట్టు చెప్పారు.

ఆ పరిస్థితిని మార్చడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రిపుల్ ఐటి అభివృద్ధికి బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఆ రోజుల్లో కె.సి. రెడ్డి క్రియాశీలక పాత్ర

వహించారని, వారికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇకపై కళాశాలల అభివృద్ది చెందుతాయని నమ్మకం కలిగించడానికే నేను ఇక్కడకు వచ్చినట్టు

పేర్కొన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనిబరచిన విద్యార్ధులకు 6 సంవత్సరాలు పాటు ట్రిపుల్ ఐటిలో శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనికి అవసరమైన సిబ్బందిని, మౌళిక

సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇకనుండి కళాశాలల పనితీరు మారుతుందనే నమ్మకం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అనంతరం ట్రిపుల్ ఐ.టి.విద్యార్ధినీ

విద్యార్ధులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.

జనవరి 1 ని ఉద్యోగ భర్తీ డే గా చేస్తాం :
 
ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

చేస్తామని, ఇందుకు సంబంధించిన క్యాలండర్ ను విడుదల చేస్తామని తెలిపారు.           

ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటి సియస్ఇ విద్యార్ధిని శ్రీహారిక మాట్లాడుతూ

రాష్ట్రంలో కంప్యూటర్ విద్యనందించే విద్యార్ధినీ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఐ.టి పరిశ్రమలు రావాలని, అందుకు మీరు ఎలాంటి చర్యలు

తీసుకుంటున్నారని ప్రశ్నించగా,  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ విడిపోయేనాటికి ఎలాంటి మౌళికవసతులు లేవని, 98 శాతం ఐ.à°Ÿà°¿ కంపెనీలు హైదరాబాద్ లోనే ఉండిపోయాయని , కేవలం 2 శాతం కంపెనీలు

మాత్రమే ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగులూరు లాంటి టైర్ వన్ సిటీలు లేవని, ఐ.టికి కొంచెం అనుకూలమైనది విశాఖపట్నం అని, అందుకు తగ్గట్టు రాబోయే ఐ.టి

పరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందుకు తగ్గ నైపుణ్యాన్ని అందించే సంస్థలు ట్రిపుల్ ఐ.టిలను, గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రతిభావంతులను

తీసుకువచ్చి ఆరేళ్ల పాటు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహ్మద్ రహితా భాను మాట్లాడుతూ గ్రామీణ

ప్రాంతాల్లో పేద విద్యార్ధినీ విద్యార్ధులకు మంచి అవకాశాలు కల్పిస్తున్న ట్రిపుల్ ఐ.టిలు, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న వై.యస్.ఆర్ స్కిల్ డెవలప్ మెంట్

సెంటర్లవలన ఎటువంటి ప్రయోజనాలున్నాయని ప్రశ్నించగా సిఎం స్పందిస్తూ రాష్ట్రంలో 75 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుచేసేదిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని,

అందులో భాగంగా ఇటీవలే చట్టాన్ని కూడా తీసుకువచ్చామని చెప్పారు. అయితే పరిశ్రమలు ఏర్పాటుచేసేటపుడు వ్యక్తి నైపుణ్యాలను చూస్తారని, ఆ దిశగా విద్యార్ధులు

తయారుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకుగాను ప్రతీ పార్లమెంటు పరిధిలోనూ మంచి కళాశాలలను గుర్తించి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటుచేస్తామని

చెప్పారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి వారికి కావలసిన విధంగా విద్యార్ధులను సాంకేతికంగా నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్

డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇకపై ప్రతీ ట్రిపుల్ ఐటిలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటరును ఏర్పాటుచేసి దానికి ఇంక్యుబేషన్ సెంటరుగా కూడా

మార్చే ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ట్రిపుల్ ఐ.టి ఏర్పాటులో సహకారం అందించిన మేధావుల సహకారం తీసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిశ్రమలకు అవసరమైన

నైపుణ్యాలను పెంపొందిస్తామని చెప్పారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 29, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam