DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాకుంబ్ లో సాధువులను అవమానించడమే లక్ష్యంగా యు ట్యూబర్లు

*అతి చేస్తున్న యూట్యూబేర్లు,  దేహశుద్ది చేస్తున్న భక్తులు* 

విశాఖపట్నం / ప్రయాగ్ రాజ్, 21 జనవరి 2025, ( డి ఎన్ ఎస్ ): ఎన్నో వింతలూ, సాధువుల విజ్ఞాన శక్తి సంపదల సమాహారం మహాకుంభమేళా. వీటిని తెలుసుకోవాల్సిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న కొందరు హిందూ వ్యతిరేక ధూర్తులకు దేహశుద్ది కూడా జరుగుతోంది.

ఈ కుంభ మేళాలో మీడియా, యూట్యూబ్ పేరుతొ కొందరు గాడి తప్పి అద్భుతమైన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే. .
ప్రయాగ రాజ్ కుంభమేళాలో ప్రతి రోజూ లక్షలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పుణ్య స్నానాలు చేసేందుకు ఘాట్ లకు వస్తున్నారు. ఇదే ప్రాంతాల్లో ఎవ్వరికి హాని కల్గించకుండా తమ పని తాము

చేసుకునే సాధువులు, సంత్ లను అవమానించడమే లక్ష్యంగా కొందరు హిందూ వ్యతిరేక యు ట్యూబర్లు రంగంలోకి దిగారు. అక్కడే జపం చేసుకునే సాధువులకు కొందరు భక్తులు దక్షిణ ఇవ్వడం జరుగుతోంది. ఈ సాధువులు ఎవ్వరిని డబ్బులు అడగడం లేదు. భక్తులు ఇస్తే వద్దనడం లేదు. ఈ క్రమం లోనే ఒక యు ట్యూబర్ గా చెప్పుకునే ఒక మహిళా ఒక సాధువును

దుర్భాషలాడుతూ, అత్యంత హ్యేయంగా ప్రవర్తించడం చూపరులను బాధపెట్టింది. అయితే ఆమెను ఈ సాధువు దక్షణ అడగక పోయినా. . .తానే మొత్తం  కుంభమేళా నిర్వాహకురాలిగా బిల్డప్ ఇస్తూ.. నానా యాగీ చేసింది. చుట్టూ చూస్తున్న వారు సైతం ఈమెను వారించక పోవడంతో మరింత రెచ్చిపోయింది. దీంతో సాధువు కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ ఘటన మొత్తం వీడియో తీసి

ఒకరు సోషల్ మీడియా లో పెట్టడం తో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ యుపి సీఎం యోగి కి, యుపి పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మిగిలిన సాధువులను సైతం దుర్భాషలాడుతూ మరికొందరు కుంభమేళాలో కనపడుతుండడం పై సాధువులు పోలీస్ లకు వీరిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 
అదే విధంగా ఐఐటి బాబా, మోనాలిసా, సాద్వి హర్ష, 7 అడుగుల

విదేశీ సాధువు, ఎడమ చెయ్యి పైకి నిలిపే చిమటె బాబా, మహిళా సాధువులను అందరిని ఇంటర్వ్యూ ల పేరుతొ విసిగిస్తూ వాళ్ళ దీక్షకు భంగం కల్గించడమే పనిగా పెట్టుకోవడంతో టీవీ చానెళ్లు, యు ట్యూబర్లను కుంభమేళా నుంచి బహిష్కరించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. 

వీళ్ళ కారణంగా పూసలు అమ్ముకునే మోనాలిసా అర్ధాంతరంగా ఇంటికి

వెళ్ళిపోయింది. హర్ష సాధ్వి ఏకాంతంలోకి వెళ్ళింది. చిమట బాబా విసిగిపోయి, యు ట్యూబేర్లకు నాలుగు తగిలించేసారు. ఐఐటి బాబా అభయ్ సింగ్ సీరియస్ అయినంత పనీ చేశారు. 

వాళ్ళ ఏకాంతానికి భంగం కల్గించే రీతిలో పైత్య ప్రకోపాలు ప్రదర్శిస్తున్న కొందరు యు ట్యూబర్ల కారణంగా మొత్తం అందరిపై వేటు వెయ్యాలి అనే డిమాండ్

వినిపిస్తోంది. 

కుంభమేళాలో తమ సాధనా శక్తిని మరింత పెంపొందించుకునేందుకు వచ్చిన వేలాది మంది  సాధువులు, సంత్ లు, భక్తుల సంకల్పానికి భంగం కల్గిస్తూ శునకానందం పొందుతున్న ఈ మీడియా, యు ట్యూబర్ల పై వేటు వెయ్యాలని కోరుకుంటున్నారు. 

కుంభమేళా అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాల్సిన భాద్యతకల్గిన

మీడియా సంస్థల ప్రతినిధులు సైతం టిఆర్పి ల కోసం పూర్తిగా గాడితప్పడం గమనార్హం. ముందస్తుగా అనుమతి తీసుకుంటే. .సాధువులే తమ లక్ష్య సాధన ప్రశాంతంగా వివరించడం జరుగుతుంది. అనుమతి లేకుండా ప్రయివేట్ ప్రాంతాల్లోకి కెమెరా లు తీసుకు వెళ్లడం చట్ట రీత్యా నేరం. ఈ నేరాలు కుంభమేళాలో ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి. కొందరు హిందూ

వ్యతిరేక శక్తులు ( అయూబ్ ) మహిళా సాధువులు బట్టలు మార్చుకునే ప్రాంతంలో వీడియో తియ్యడం తో అతనికి భక్తులు దేశశుద్ది చెయ్యడం జరిగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam