DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుంభ మేళ లో మౌని అమావాస్య నాడు వేలాదిగా సన్యాసం దీక్షలు

*నాగసాధువులకు స్వీయ పిండప్రదానం, మంత్రం దీక్ష ముఖ్యం*

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖ పట్నం, జనవరి 19, 2025 (డిఎన్ఎస్) :* 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళాలో అత్యంత పవిత్రమైనది మౌని అమావాస్య. ఈ రోజున ప్రపంచంలోని నాగ సాధువులు, అఘోరీలు, సంత్ లు సహా అశేష భక్త జనం స్నాన్ ఘాట్ లకు

చేరుకుంటారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో ప్రతి రోజు లక్షలాది మంది పవిత్ర స్నానాదికాలు చేస్తూ, తమ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. మౌని అమావాస్య రోజున ( జనవరి 29, 2025 ) సుమారు 10 కోట్లకు పైగా భక్త జనం రానున్నట్టు అంచనా వేస్తున్నారు. అత్యంత అరుదైన ఈ రోజున వేలాది మంది సన్యాస దీక్ష తీసుకోనున్నారు. ఇప్పడికే నూతన

నాగసాధువుల దీక్ష ప్రక్రియ మొదలయ్యింది. ఆచార్య మహా మండలేశ్వర్ ఇచ్చిన ముండాన, విజయ హవన మరియు, మంత్ర దీక్షలతో సామాన్యుడు సన్యాసి గా ఉంటాడు. తరువాత స్వీయ పిండ ప్రదానం జరుగుతుంది. ఎవరికీ వారే స్వయంగా తమకు పిండ ప్రదానం చేసుకుంటారు. తదుపరి ఈ లౌకిక జీవితం తో బంధం తెగిపోతుంది. తదుపరి సన్యాసి నుంచి నాగ సాధువుగా

మారనున్నారు. 
మహాకుంభ మేళా లో వివిధ అఖాడాలకు చెందిన నాగ సాధువులకు దీక్ష ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.  సంవత్సరాల తరబడి కఠినమైన ధ్యానం చేసిన తర్వాత, సాధువు తన పిండాన్ని సమర్పించి, గంగా నదిలో 108 సార్లు స్నానం చేసి, ఘాట్ మీద 24 గంటలు జపిస్తూ కూర్చున్నారు. ఆచార్య మహామండలేశ్వర్ ఇచ్చిన ముండాన, విజయ హవన మరియు మంత్ర

దీక్షల తరువాత, వారు నాగ సాధువు అనే బిరుదును పొందుతారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam