DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదికగా ఎబివిపి పోరాట పటిమ చూపుతాం: ఏపీ కార్యదర్శి యాచేంద్ర

*24 నుంచి విశాఖ లో ఎబివిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సభలు* 

*అతిధులుగా క్రికెటర్ రాయుడు, సినీ నటుడు శ్రీకాంత్* 

*విశాఖపట్నం, 22 జనవరి 2025, ( డి ఎన్ ఎస్ ):* సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ( ఎబివిపి) పోరాట పటిమను చూపిస్తామని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి సూళ్లూరు యాచేంద్ర

ప్రకటించారు. ఈ నెల 24 నుంచి విశాఖ నగరం లో జరుగనున్న ఎబివిపి 43 వ రాష్ట్ర సభల నేపథ్యంలో అయన డీఎన్ఎస్ కు పలు కీలక అంశాలు తెలియచేసారు. దేశ భవిష్యత్ ను శాసించేది విద్యార్థి లోకమేనని, వారికి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటేనే దేశం అగ్రగామిగా ఉంటుందన్నారు. ఉన్నత విద్య, ఉత్తమ ఉపాధి ఉంటేనే యువత దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతారన్నారు.

స్వాతంత్య్ర పోరాటం లో సైతం యువతే కీలక పాత్ర పోషించిందని, అనంతరం ఎన్నో ఉద్యమాలు విద్యాలయాల నుంచే ఆరంభమయ్యాయన్నారు. సనాతన భారత దేశ సంప్రదాయ వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భవించిందన్నారు. విద్య విధానంలో మార్పు లు రావాలని, ఎన్నడో పురాతన కాలం నాటి తప్పుడు కథనాలను చరిత్ర పేరుతొ

నేటికీ పాఠశాల స్థాయిలో నెత్తిన రుద్దుతున్నారని మండిపడ్డారు. భారత్ ను ఆక్రమించుకున్న తురుష్కులు, మొఘలులు, ఆంగ్లేయులు, డచ్, పోర్చుగీసు, వీళ్లంతా ఉత్తములుగా పాఠ్యంశాలుగా మన నెత్తిన రుద్దారన్నారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపే, గోఖలే, సుభాష్ బోస్, అల్లూరి వంటి వారి వాస్తవ చరిత్రలు

నేటి తరగతి గదుల్లో వినిపించడం లేదన్నారు. 
ఇక విద్యార్థి దశ నుంచే భారత పురాతన వైభవం, ఆర్థిక, సామాజిక, దేశ రక్షణ, మహిళా రక్షణ,   విద్యార్థుల భాద్యత వంటి అంశాలను పాఠ్యాంశాలు గా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఏబివిపి జాతీయ స్థాయిలో చర్చిస్తోందన్నారు. 
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల్లో

పూర్తిస్థాయి టీచర్లు లేని కారణంగా పి హెచ్ డి చేసేవాళ్లు తగ్గిపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం వర్సిటీలకు ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులు డీఎస్ టి, రూసా నిధులు బ్యాంకు ల్లోనే మురిగిపోతున్నాయన్నారు. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు కేటాయించిందని, వాటిని వినియోగించుకునే స్థితి నేడు రాష్ట్రంలో లేదన్నారు.

వీటన్నింటి పై పూర్తి స్థాయి లో ఈ సభల్లో చర్చిస్తామన్నారు. 
చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేని కారణంగా యువత విదేశాలకు తరలి వెళ్తున్నారని, అయితే అక్కడ చట్టాల కారణంగా ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. విద్యాలయాల స్థాయిలోనే తగిన ఉపాధి లభించే విధంగా పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.   
1949 నుంచి అనేక

విషయాలపై విద్యార్ధుల గొంతు వినిపిస్తోన్న అతిపెద్ద సంస్ధ ఎబివిపి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని, వాటిపై సభల్లో చర్చిస్తామన్నారు. 

24 నుంచి ఏబివిపి రాష్ట్ర సభలు:
  
ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు విశాఖ లో అఖిల భారత విద్యార్థి పరిషత్ 43 వ రాష్ట్ర సభలు నిర్వహిస్తున్నట్టు ఏబివిపి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సూళ్లూరు యాచేంద్ర తెలిపారు. బుధవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ సభలు జరుగుతున్నాయన్నారు. 

రాష్ట్ర స్ధితి పేరుతో రెండు తీర్మానాలు చేస్తామని, పంచపరివర్తన్  అనే పేరుతో ఐదు అంశాలపై

దిశానిర్ధేశం చేస్తామన్నారు. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తి అయినా సందర్బంగా రాజ్యాంగం పై ఒక సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సభల ప్రారంభ సూచికగా కాషాయపు కాగడ జెండా భారీ ర్యాలీ నిర్వహిస్తామని, రెండు తెలుగురాష్ట్రాల్లో జనమంచి గౌరీశంకర్ పేరు మీద యువ పురస్కారాన్నీ ఈ ఏడాది ఒంగోలు కు చెందిన సూర్య సిరి

చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, యువ సామాజిక కార్యకర్త సయ్యద్ షాహానాజ్ కు అందిస్తున్నామన్నారు. ఇదే వేదికగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు. 

ప్రముఖుల హాజరు ; 
ఈ సభల ప్రారంభోత్సవం నకు అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు, ముగింపు వేడుకలకు సినీ నటుడు ఎం. శ్రీకాంత్

హాజరవుతున్నారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంటినెంటల్ కాఫీ ఇది చల్ల రాజేంద్ర ప్రసాద్, ఎబివిపి జాతీయ ప్రధాన కార్యదర్శి డా. వీరేంద్ర సోలంకి, పాల్గొంటున్నారన్నారు.   
యువతలో చైతన్యం కల్గించే విధంగా ఎబివిపి జాతీయ సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ (పంచ పరివర్తన్) ఉంటుందన్నారు. 

సాగర తీరంలో శోభా

యాత్ర :
జనవరి 25 న విశాఖ సాగర తీరంలో అశేష జనావాహినితో భారీ కాషాయ జండాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిలో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహా కార్యవహ్ మాలపాటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రసంగం చేస్తారన్నారు. 

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సభల ఆహ్వాన కమిటీ కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ విశాఖలో 21 ఏళ్ల

తర్వాత మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ సభలకు సుమారు 1500 నుంచి 2 వేల మంది వరకూ విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి హాజరవుతున్నారన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు సమీపిస్తున్న వేళ, ఇక్కడ జరిగే మహాసభలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాజ్యాంగ స్పూర్తితో విద్యార్ధులు ఏరకంగా నడవాలి అనే నినాదంతో ముందుకు

వెళతామన్నారు.గిరిజన విప్లవకారుల త్యాగాలను కూడా మహాసభల్లో గుర్తు చేసుకుంటామని తెలిపారు. 
ఈ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ఇంచార్జి శివకుమార్, ఆంధ్ర యూనివర్సిటీ లా కళాశాల ఎబివిపి అధ్యక్షులు హరిచందన, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam