DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిఆర్ పి కోసం కుంభమేళా లో కవరేజ్ పేరుతో మీడియా కుప్పిగెంతులు

*అనవసర కవరేజ్ లో జాతీయ మీడియా, కానరాని తెలుగు మీడియా*

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖ పట్నం/ ప్రయాగ్ రాజ్, జనవరి 20, 2025 (డిఎన్ఎస్):* కోట్లాదిమంది దృష్టిని ప్రభావితం చెయ్యగలిగిన మీడియా, సోషల్ మీడియా రంగం టి ఆర్ పి ల కోసం గాడితప్పి, అనవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే విషయం

ప్రసుత్తం జరుగుతున్నా ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో కనపడుతోందని జాతీయ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళ లో పవిత్ర స్నానం కు ఎంత ప్రాధాన్యత ఉందొ. .అక్కడకు వచ్చే సాధువులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, విదేశీ పరిశోధకులు లక్షలాదిగా హాజరవుతున్నారు. వీరి అందరి కంటే

భిన్నంగా సామాన్య జనజీవనానికి దూరంగా జీవించే నాగ సాధువులు, తపస్సు సంపన్నులు, అతీంద్రియ శక్తులు కల్గిన మహనీయులు తమ శక్తిని మరింత విస్తృతం చేసుకునేందుకు కుంభమేళాకు హాజరవుతుంటారు. నూతనంగా సన్యాస దీక్ష తీసుకునే వారికి పరీక్షలు నిర్వహించడం, ఆహార నియమాలు పరిశీలన, వారి సాధన కు పరీక్షలు సైతం

నిర్వహిస్తుంటారు.

సుమారు 144 ఏళ్ళ కు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభ మేళాలో వింతలూ, విజ్ఞానాలను కవరేజి చెయ్యవలసిన మీడియా సంస్థలు, అక్కడ కనిపించిన యువతులను, ముంబై ఐఐటి విద్యార్థి సన్యాసి గా దర్శనం ఇవ్వడంతో ఆయన్ని కూడా వీడియో తీసి అవసరం లేని ప్రచారం చేసాయి. 
అక్కడ పూసలు అమ్ముకునే ఒక యువతిని, నాగ సాధు అఖాడాలో

దీక్షలో ఉన్న ఒక మోడల్ ని వీడియో తీసి, కుంభమేళా అంటే వీళ్ళే అంతగా ప్రచారం చెయ్యడం తో వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయితో ఫోటో తీసుకోడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో, వ్యాపారం లేక, తన కుటుంబానికి ఇబ్బంది గా ఉండడంతో ఆ పూసలు అమ్ముకునే యువతి అర్ధాంతరంగా రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయింది. ఇక మీడియా గోల తట్టుకోలేక ఆ మోడల్ ను సైతం తమ

అఖాడా నుంచి బయటకు పంపేశారు సాధువులు. ఇక ఐఐటి బాబా గా మీడియా ప్రచారం చేసిన అభయ్ సింగ్, తనకు ఓపిక ఉన్నంతవరకూ తన జీవితాన్ని వివరించారు. తాను సన్యాస దీక్ష లో ఉన్నానని, తన సాధనకు భంగం కలిగించవద్దని సూచించారు. దీంతో సుదీర్ఘ దీక్షలోకి వెళ్లిపోయారు. అయన చెప్పిన అంశాల లోని నిగూఢ విషయాన్నీ అర్ధం చేసుకోవడం చేతగాని మీడియా

విలేకరులు, తమకు తోచిన పైత్యాన్ని కెమెరాల ముందు వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. వీళ్ళ వ్యాఖ్యలు విని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. 
మీడియా లో వచ్చిన ఈ వీడియో లు చూసి సోషల్ మీడియా లో అత్యంత పైత్యం సృష్టించే వాళ్ళు సైతం కుంభమేళాలో వీళ్ళ కోసం వెతుకుతూ సాధువులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఓపిక నశించిన సాధువులు సోషల్

మీడియా, యూట్యూబ్ వీడియోల పైత్య కారులను తమ ప్రాంతంలోనే ఉండవద్దని హెచ్చరికలు జారీ చేసారు. 

దేశంలోని కొన్ని వర్గాలకు ఈ కుంభమేళా విజయ వైభవం మింగుడు పడక నానా రచ్చ చేసేందుకు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. అయితే విదేశాల దృష్టి అంతా భారత్ లో జరుగుతున్నా కుంభమేళా పైనే ఉంది. దీన్ని పరిశోధన చేసేందుకు కొంతమంది,

సనాతన హిందూ వైభవం తెలుసుకునేందుకు ఇంకొంతమంది, సాధువులను కలిసి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు, లక్షలాదిగా విదేశీయులు కుంభమేళాకు చేరుకుంటున్నారు. వీరిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, లాంటి పాశ్చాత్య దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, నేపాల్ వంటి సమీప దేశాలు, సహా కొన్ని ముస్లిం దేశాల నుంచి కూడా ఎందరో ప్రయాగ్

రాజ్ కు చేరుకుంటున్నారు. 
ఇలా వచ్చిన వారిలో స్టీవ్ జాబ్స్ సతీమణి కమల ( దీక్ష తర్వాత పేరు), ఉన్నత విద్య నిపుణుల విదేశీ బృందం, ఇటలీ నుంచి వచ్చిన మహిళల బృందం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ తో భేటీ అయ్యి, శివతాండవ స్తోత్రం, రామాయణ శ్లోకాలు ఆలపించడం గమనార్హం. 

ఒక ఉత్సవం లో సుమారు 40 కోట్లకు పైగా జనం

హాజరవుతారని అంచనాలతో విశ్వ రికార్డు లు పరిశీలన బృందం సైతం ప్రయాగ్ రాజ్ లోనే ఉండడం గమనార్హం. 

ఇవేవీ  కవరేజ్ చెయ్యడం చేతగాని మీడియా వర్గాలు కేవలం అందమైన యువతులను వీడియో తీసి, ఇదే కుంభమేళా అంటే అనే ప్రచారం చేయడాన్ని మొత్తం అందరూ చీవాట్లు పెడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన మీడియా ఛానెల్స్

కుంభమేళాకు కనుచూపు మేరలో కనపడక పోవడం గమనార్హం. నూతిలో కప్పలు మాదిరిగా వీళ్ళు ఉన్న చోటే వీళ్ళు కవరేజ్ ఇవ్వాలి అని రీతిలో అదే మూస పద్దతిలో స్థానిక రాజకీయ పార్టీల కుళ్ళు, కుతంత్రాలను ప్రసారం చెయ్యడం, రోజంతా వాటిని విశ్లేషించడం తోనే కాలం గడిపేస్తున్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని

పాత్రికీయులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. జనం వీటిని చీదరించుకుంటున్న కనీసం కదలిక లేకపోవడం గమనార్హం. 

బిబిసి, సీఎంఎం, ఎయిర్ సింగపూర్, వంటి విదేశీ మీడియా సంస్థలతో పాటు, పాకిస్తాన్ సైతం కుంభమేళాను ఎంతో ఆసక్తి గా గమనిస్తోంది. స్థానికంగా భారత్ లో ఉన్న మీడియా కు మాత్రం కనపడడం లేదంటే అతిశయోక్తి

కాదు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam