DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్యాగరాజ స్వామి జీవితం సమాజానికి మార్గదర్శకం: వీణా గాయత్రి

*త్యాగరాజ సంగీత వైభవంపై డిఎన్ఎస్ తో సంగీత సరస్వతి*

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖ పట్నం, జనవరి 18, 2025 ( డి ఎన్ ఎస్) :* పాశ్చాత్య పోకడలకు లోనవుతు ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్న వారికీ మహత్తర మందు సంగీత సాధనేనని, తమిళనాడు సంగీత & లలిత కళల విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, ప్రముఖ సంగీత

విద్వాంసురాలు వీణ ఈ గాయత్రి అభిప్రాయపడ్డారు. త్యాగరాజ అరాధన ట్రస్ట్  నిర్వహిస్తున్న  త్యాగరాజ అరాధన ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  శనివారం స్థానిక కళాభారతి ప్రాంగణం లో ఈ ఉత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎన్ ఎస్ మీడియా తో ఆమె ప్రత్యేకించి మాట్లాడారు. సంగీతం నేపథ్యంలో నేటి తరం ఎంతో ఉన్నత

హోదాలకు చేరుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో గాత్రం సాధన చేస్తారని, అయితే అది సుదీర్ఘ సాధన జరిగితే మనిషి ప్రవర్తనలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎందరో మహానుభావులు సంగీత సాధన ద్వారా శిష్య ప్రశిష్యులను తయారు చేస్తున్నారన్నారు. 

విశాఖ నగరం సంగీత పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉందన్నారు. గత 30 ఏళ్లుగా

త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. 

ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ముందుగా వైభవంగా తిరువీధి ఉత్సవం నిర్వహించారు.  త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి  గుమ్మలూరి ప్రసాద్ త్యాగరాజ స్వామి వేష ధారణ లో ముందు నడుస్తుండగా కోలాటం బృందం, సన్నాయి వాయిద్యం, భారీ సంఖ్యలో సంగీత కళాకారులు

గాత్ర కచేరీ లు చేస్తూ శ్రీ సీతా రామ చంద్ర స్వామిని నగర వీధుల్లో ఊరేగించారు.

అనంతరం సుమారు 200 మంది కళాకారులు కళాభారతి ప్రాంగణం లో త్యాగరాజ స్వామి ఘన పంచరత్న కీర్తనలు ఆలపించి త్యాగరాజ స్వామి కి సంగీత నివాళి అర్పించారు.

తదుపరి వర్ధమాన, సీనియర్ కాకరులచే 10 నిమిషాల, 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివి లో సంగీత

కచేరీలను ప్రారంభించారు.

ఈ వేడుకల్లో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంస్థ అధ్యక్షులు ఏం ఎస్ ఎన్ రాజు, కార్యదర్శి శ్రీరామాదాస Dr  రాంబాబు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పంతుల గోపాలరావు, ఏం ఎస్.. శ్రీనివాస్, వివి రమణమూర్తి పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam