DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భక్త జనసంద్రంగా మారిన జగ్గన్న తోట ప్రభల తీర్ధం

*భక్తులను ఆశీర్వదించేందుకు ఒకేచోట చేరిన ఏకాదశ రుద్రులు*

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

విశాఖపట్నం / అంబాజీపేట, 15 జనవరి, 2025 (డిఎన్ఎస్ ) : కనుమ పండుగ పేరు చెప్పగానే కోనసీమ ప్రాంతంలో భక్త సందోహంతో నిండిపోతుంది. అత్యంత ప్రధానమైన ప్రభల తీర్ధం దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఏకాదశ

రుద్రులు ఒకేచోట దర్శనమిచ్చే ఏకైక ఉత్సవం జగ్గన్నతోట తీర్ధం. 

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలంలోని  జగ్గన్న తోట ప్రభల తీర్థం బుధవారం వైభవంగా జరిగింది. భక్త జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ తీర్ధం లో భక్తులకు ఆశీస్సులు అందించేందుకు 1 ) గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, 2 ) గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, 3 ) వ్యాఘేశ్వరం వ్యామ్రేశ్వరస్వామి, 4 ) కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, 5 ) ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, 6 ) వక్కలంక కాశీవిశ్వేశ్వరస్వామి, 7 )నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, 8 ) ముక్కామల రాఘవేశ్వరస్వామి, 9 )

మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, 10 ) పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, 11 ) పుల్లేటికుర్రు అభినవ వ్యామ్రేశ్వరస్వామి ప్రభలు తరలి వచ్చాయి. 
శిలాతోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలకరించారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్ధనికి రాష్ట్ర నలు మూలల నుండే కాకుండా ఇతర

రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో  ప్రజలు హాజరయ్యారు. కౌశిక నది అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ  కౌశిక నది  దాటి ప్రవేశించే దృశ్యం చూపరులను గగుర్పాటుకు  గురిచేసింది. శరభ శరభ అశ్శరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజాన కు ఎత్తుకొని

కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్ధంలోకి ప్రభలను తీసుకువచ్చారు. 
తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరి చేల గట్లు , రోడ్డులు పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రభలు కౌశిక నది దాటిన తీరును జనం పోటీ పడుతూ మరీ ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్ర ధారణతో యువతీ, యువకులు పోటోల

కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాగ్రేశ్వరం నుండి వ్యాగ్రేశ్వరస్వామి ప్రభ తీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒక సారి పైకి ఎత్తారు. తీర్థం జరిగే ప్రాంతం  వేలాది సంఖ్యలో జనం కిక్కిరిసిపోయింది. కొత్తపేట డిఎస్పీ  వై. గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు

బందోబస్తు నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jan 30, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam